LIC Credit Cards : ఈ ఎల్ఐసీ క్రెడిట్ కార్డులతో ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు..!

ఈ ఎల్ఐసీ క్రెడిట్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI), ఇన్సూరెన్స్ కవర్ (Insurance Cover) సహా మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఎల్ఐసీ కార్డు రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

LIC Credit Cards : ఈ ఎల్ఐసీ క్రెడిట్ కార్డులతో ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు..!

Lic Credit Card No Cost Emi, Insurance Cover

LIC Credit Card : No-cost EMI, Insurance Cover : ఈ ఎల్ఐసీ క్రెడిట్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI), ఇన్సూరెన్స్ కవర్ (Insurance Cover) సహా మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే ఈ ప్రయోజనాలు అందరికి కాదండోయ్.. కేవలం ఎల్ఐసీ పాలసీదారులు (LIC Policyholders), LIC Agents సహా ఎల్ఐసీ ఇండియా ఉద్యోగులు, అనుబంధ సంస్థల్లో పనిచేసేవారికి మాత్రమే వర్తించనుంది. ఈ ఎల్ఐసీ కార్డు రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. LIC Cards  Services Limited (LIC CSL), IDBI Bank భాగస్వామ్యంలో ఈ రెండు వేరియంట్ల ఎల్ఐసీ (RuPay Credit Cards) క్రెడిట్ కార్డులను సంయుక్తంగా లాంచ్ చేశాయి.

రెండు వేరియంట్లలో క్రెడిట్ కార్డులు :
Lumine, Eclat credit cards లను RuPay network లో భాగంగా లాంచ్ చేశాయి. ఈ కో-బ్రాండెడ్ RuPay క్రెడిట్‌లను ‘Lumine’ Platinum Credit Card, LIC CSL ‘Eclat’ Select Credit Card అనే పేరుతో రిలీజ్ చేశాయి. కస్టమర్లను మరింత ఆకట్టుకునేందుకు ఆఫర్లు, బెనిఫిట్స్ అందిస్తూ ఎల్ఐసీ ఈ తరహా కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా చెల్లించే ప్రతి రూ.100పై ఆకర్షణీయమైన బెనిఫిట్స్ పొందవచ్చు. Lumine Card ద్వారా మూడు వరకు డిలైట్ పాయింట్స్ పొందొచ్చు. అలాగే Eclat card ద్వారా నాలుగు పాయింట్లు పొందవచ్చు. LIC Insurance Policy ప్రీమియం లేదా రిన్యువల్ సమయంలో కస్టమర్లు ఈ క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేస్తే.. రివార్డు పాయింట్లను రెట్టింపు పొందవచ్చు.

Lumine క్రెడిట్ కార్డుదారులు 60 రోజుల వ్యవధిలో రూ.10వేల వరకు ఖర్చు చేస్తే.. రూ. వెయ్యి వరకు ‘Welcome Bonus Delight Points’ అర్హత పొందవచ్చు. అదే.. Eclat కార్డుదారులు ఇదే సమయంలో 1500 పాయింట్ల వరకు పొందవచ్చు. ఈ రెండు కార్డుల ద్వారా ఇన్సూరెన్స్, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్, పర్సనల్ యాక్సిడెంట్, పర్మినెంట్ డిసేబులిటీ కవర్, క్రెడిట్ షీల్డ్ కవర్, జీరో లాస్ట్ కార్డ్ లియాబిలిటీ వంటి నుంచి అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. రూ.400 పైనా ట్రాన్సాక్షన్ చేస్తే.. 1శాతం వరకు ఇందనం సర్ చార్జీలపై మాఫీ పొందవచ్చు. రూ.3వేల పైనా ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదా ఫోర్ క్లోజర్ ఫీజు లేకుండానే EMI లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. EMI Scheme కింద 3 నెలల నుంచి 6 నెలలు, 9 నెలలు లేదా 12 నెలల వరకు ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ రెండు కార్డులపై ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ 48 రోజుల వరకు పొందవచ్చు. అలాగే వ్యాలిడిటీ నాలుగేళ్లు వరకు ఉంటుంది.