LIC WhatsApp Services : ఎల్ఐసీలో కొత్త వాట్సాప్ సర్వీసు.. మీ పాలసీ స్టేటస్, ప్రీమియం ఎంత కట్టాలో ఈజీగా చెక్ చేసుకోవచ్చు..!

LIC WhatsApp Services : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీదారుల కోసం ఫస్ట్ ఇంటరాక్టివ్ WhatsApp సర్వీసులను ప్రవేశపెట్టింది. LIC ఆన్లైన్ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారులు LIC అధికారిక WhatsApp చాట్‌బాక్స్ ద్వారా ప్రీమియం వివరాలు, ULIP ప్లాన్ స్టేట్మెంట్ వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. LIC అధికారిక ప్రకటన ప్రకారం.. ఆన్లైన్లో తమ పాలసీలను నమోదు చేసుకోని పాలసీదారులు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లో సర్వీసులను పొందవచ్చు.
అందుకోసం ఎల్ఐసీ వినియోగదారులు తమ వివరాలను వాట్సాప్ సర్వీసులో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. LIC వినియోగదారులు www.licindia.inలో LIC కస్టమర్ పోర్టల్‌ని విజిట్ చేయడం ద్వారా తమ పాలసీని నమోదు చేసుకోవచ్చు. పాలసీని ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసిన తర్వాత LIC WhatsApp సర్వీసులను ఉపయోగించడానికి ఈ దశల వారీగా ఫాలో అవ్వండి.
LIC WhatsApp సర్వీసులను ఎలా ఉపయోగించాలి :
* మీ ఫోన్ కాంటాక్ట్‌లో LIC అధికారిక WhatsApp నంబర్ (8976862090)ను సేవ్ చేయండి.
* మీ వాట్సాప్‌ని ఓపెన్ చేసి.. ఆపై LIC వాట్సాప్ చాట్ బాక్స్‌ను సెర్చ్ చేసి ఓపెన్ చేయండి.
* చాట్ బాక్స్‌లో ‘Hi’ అని పంపండి.
* LIC చాట్‌బాట్ మీకు ఎంచుకోవడానికి 11 ఆప్షన్లను పంపుతుంది.
* సర్వీసుల ఎంపిక కోసం ఆప్షన్ నంబర్‌తో చాట్‌లో రిప్లే ఇవ్వండి.
* ప్రీమియం తేదీకి ఉదాహరణ 1, బోనస్ సమాచారం కోసం 2 అని ఎంటర్ చేయండి.
* LIC వాట్సాప్ చాట్‌లో అవసరమైన వివరాలను షేర్ చేస్తుంది.

How to check policy status, premium due details
Read Also : WhatsApp New Privacy Policy : కొత్త ప్రైవసీ పాలసీ వెనక్కి తీసుకోవాలి.. వాట్సాప్‌కు కేంద్రం నోటీసులు..
ముఖ్యంగా, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మెసేజ్ LIC కస్టమర్ పోర్టల్‌కు పంపండి. మీరు ఇప్పటికే వేరే మొబైల్ నంబర్‌తో పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లయితే.. కస్టమర్ పోర్టల్ ప్రొఫైల్‌లో WhatsApp నంబర్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ebiz.licindia.in/D2CPM/#Loginలో మీ మొబైల్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా సమాచారాన్ని అప్డేట్ చేయవచ్చు.
LIC WhatsApp సర్వీసులో అందుబాటులో ఉన్న సర్వీసుల జాబితా ఇదే :
* ప్రీమియం బకాయి
* బోనస్ సమాచారం
* పాలసీ స్టేటస్
* లోన్ అర్హత కొటేషన్
* రుణ చెల్లింపు కొటేషన్
* రుణ వడ్డీ చెల్లించాలి
* ప్రీమియం చెల్లించిన సర్టిఫికేట్
* ULIP – యూనిట్ల స్టేట్మెంట్
* LIC సర్వీసుల లింక్‌లు
* సర్వీసులను ప్రారంభించండి/నిలిపివేయండి
* End the conversation
LIC ఆన్లైన్ పోర్టల్‌లో పాలసీని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
* www.licindia.in ని సందర్శించండి.
* ఇప్పుడు క్లిక్ చేసి, ‘Customer Portal’ ఆప్షన్‌ను ఓపెన్ చేయండి.
* మీరు కొత్త యూజర్ అయితే.. New Userపై క్లిక్ చేసి, అవసరమైన అన్ని వివరాలను ఎంటర్ చేయండి.
* ఇప్పుడు మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ని ఎంచుకుని, ఆపై మీ వివరాలను సమర్పించండి.
* ఇప్పుడు మీ యూజర్ ఐడిని ఉపయోగించి ఆన్లైన్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
* తదుపరి ‘Add Policy’ కింద “Basic Services”పై Click చేయండి.
* ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేయడానికి మీ అన్ని పాలసీల వివరాలను యాడ్ చేయండి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..