వీటితో కరోనా వైరస్ ఖతం 

  • Published By: bheemraj ,Published On : June 20, 2020 / 12:55 AM IST
వీటితో కరోనా వైరస్ ఖతం 

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. అయితే కరోనా వైరస్ వల్ల  శానిటైజ్‌ అనేది నిత్యకృత్యమైంది. చేతులైనా, వస్తువైనా రసాయన శుద్ధి తప్పనిసరి అయిపోయింది. ఈ నేపథ్యంలో వైరస్‌లకు చిక్కకుండా షాపింగ్‌మాల్స్‌, సూపర్‌మార్కెట్లు తదితర చోట్ల ఉపయోగించుకునేందుకు లార్డ్స్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులు విభిన్నమైన యంత్ర పరికరాలను ఆవిష్కరించారు. ఇవి రోగకారకాలను నశింపజేసి మనల్ని మరింత సురక్షితంగా ఉంచుతాయి. 

మనీక్యూర్‌
కరెన్సీ నోట్లు, నాణేలతో పాటు నిత్యం చేతులు మారుతున్న వస్తువులు, ఉత్పత్తులపై ఉన్న వైరస్‌ చనిపోయేలా మనీక్యూర్‌ పరికరాన్ని తయారు చేశారు. దీని ద్వారా అతినీల లోహిత కిరణాలను కాయిన్స్‌, కరెన్సీ నోట్లు తదితర వస్తువులపై పడేలా చేసి వైరస్‌ను నశింపజేస్తారు. 

స్మార్ట్‌ వేపరైజ్డ్‌ డిసిన్‌ఫెక్టర్‌ కేవ్‌
జనం ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశాలు, షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ మార్కెట్‌, ఇతర ప్రదేశాల్లో స్మార్ట్‌ వేపరైజ్డ్‌ డిసిన్‌ఫెక్టర్‌ కేవ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు.. ఒక నిమిషం వ్యవధిలో పది మందిని ఒకేసారి శానిటైజ్‌ చేస్తుంది. ఇది అల్ట్రా సోనిక్‌ వేవ్స్‌ విధానంతో పనిచేస్తుంది. 

ఫెడల్‌ డ్రివెన్‌ శానిటైజర్‌
ప్రస్తుతం ఈ ఫెడల్‌ డ్రివెన్‌ శానిటైజర్‌ విధానం పలు షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ మార్కెట్ల్‌లో చూస్తున్నాం. వాటితో పోల్చుకుంటే ఇది కొంత భిన్నంగా ఉంటుంది. ఫెడల్‌ సాయంతో శానిటైజర్‌ చేతులపై వేసుకుంటున్నప్పుడు ఫాగ్‌ను కూడా  విడుదల చేస్తుంది. రోగకారకాలను నశింపజేస్తుంది.   

లార్డ్స్‌ డ్రోన్‌ శానిటైజర్‌
లార్డ్స్‌  డ్రోన్‌ శానిటైజర్‌ చూడటానికి సాధారణ డ్రోన్‌ వలె కనిపిస్తుంది. ఇందులో 5 లీటర్ల సామర్థ్యం గల డబ్బాను అమర్చి.. దీనికి కనెక్ట్‌ చేసిన ప్రోగ్రామింగ్‌ను ఆ ప్రదేశంలో సెట్‌ చేయడంతో గాలిలో ఎగురుతూ శానిటైజ్‌ చేస్తుంది. ఇది రోడ్లపై, కార్యాలయాల్లో, ఎక్కువ మంది తిరిగే ప్రదేశాల్లో (ఔట్‌ డోర్స్‌) వినియోగించేందుకు వీలుగా ఉండేలా రూపొందించారు.

Read: నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు కేసులు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి