Lucid Motors : టెస్లాను తలదన్నే కారు.. 20ని ఛార్జింగ్ తో 482 కిలోమీటర్ల ప్రయాణం

ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కారంటే టెస్లా గురించే చెప్పుకునే వారు. ఇప్పుడు టెస్లాను తలదన్నే ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది లూసిడ్ మోటర్స్ ఎలక్ట్రిక్ కారు.

Lucid Motors : టెస్లాను తలదన్నే కారు.. 20ని ఛార్జింగ్ తో 482 కిలోమీటర్ల ప్రయాణం

Lucid Motors

Lucid Motors : ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హావ నడుస్తోంది. దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తలమునకలయ్యాయి. ఇప్పటికే కొన్ని కంపెనీల కార్లు రోడ్లపై దూసుకెళ్తుండగా, మరికొన్ని కంపెనీల కార్లు చివరి దశలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లో చూసుకుంటే టెస్లా కంపెనీ ఓ రేంజ్ లో కార్ల అమ్మకాలు చేస్తుంది. ఇప్పటి వరకు పోటీ లేకపోవడంతో ఈ కంపెనీ కార్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక ఇదే సమయంలో టెస్లాను తలదన్నే విధంగా లూసిడ్ మోటార్స్ ఎయిర్ డ్రీమ్ ఎడిషన్ కారును తీసుకురానుంది.

Read More : Prema Desam : ట్రెండ్ సెట్టర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సీక్వెల్..

లూసిడ్‌ కార్లు టెస్లా కార్ల కంటే మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 840 కిలోమీటర్ల మేర వెళ్తుంది. టెస్లా కార్లు ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే సుమారు 758 కిలోమీటర్లకు వరకు ప్రయాణిస్తాయి. టెస్లాతో పోల్చుకుంటే ఈ కారు 100 కిలోమీటర్ల వరకు వెళ్తోంది. అంతేకాకుండా కారులో అల్ట్రా ఫాస్ట్‌ చార్జింగ్‌ను ఏర్పాటు చేయడంతో కేవలం 20 నిమిషాల ఛార్జింగ్‌తో ఈ కారు 482 కిలో మీటర్లు ప్రయాణిస్తోందని లూసిడ్‌ వెల్లడించింది.

Read More : Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు మళ్లీ ఎప్పుడంటే!

ఈ కారు 2.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక ఈ ఏడాది చివర్లో ఈ కార్లు మార్కెట్లోకి రానున్నాయి. దీని ప్రారంభ ధర రూ. 57 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. లూసిడ్‌ ఎయిర్‌ డ్రీమ్‌ ఎడిషన్‌ 113కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీను అమర్చారు. ఈ కారులో డ్యూయల్‌ ఆక్టివ్‌ కోర్‌ మోటార్‌ను ఏర్పాటుచేశారు. అయితే ఈ కారు డిసైన్ కూడా టెస్లా కంటే ఆకర్షణీయంగానే ఉంది.