కొత్త వెర్షన్ : mAadhar బెనిఫెట్స్ ఇదిగో

  • Published By: madhu ,Published On : November 25, 2019 / 01:18 PM IST
కొత్త వెర్షన్ : mAadhar బెనిఫెట్స్ ఇదిగో

ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌ కావాలి‌. పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ, సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా ఆధార్‌ తప్పనిసరి. అలా అని ఏదైనా పథకానికిగానీ దరఖాస్తుకుగానీ ఆధార్‌ కార్డు సమర్పిస్తే వేరొకరు దుర్వినియోగం చేస్తారనే భయమూ ఉంది.

ఈ ఇబ్బంది లేకుండా mAadhaar యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దీంట్లో మార్పులు చేసి కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఉన్న పాత యాప్‌ను తొలగించి mAadhaar కొత్త వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది.  

> mAadhaar యాప్‌ను ప్లే స్టోర్ / యాప్ ద్వారా ఇన్ స్టాల్ చేసుకోవాలి. 
> మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి (ఆధార్‌ కార్డుపై ఏ నెంబర్ ఉందో అదే ఇవ్వాలి)
> వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేయాలి. 
> తర్వాత యాప్‌లోకి వెళ్లి..ఆధార్ కార్డును నమోదు చేయాలి. 
> మళ్లా వచ్చిన ఓటీపిని ఎంటర్ చేయాలి. 
> ఆధార్‌కు అనుసంధానం చేసినట్లు చూపిస్తుంది. 
> ఆధార్‌కు లాక్ క్రియేట్ చేయడం కోసం ముందుగా my aadharr అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
> మై ఆధార్‌ను ఓపెన్ చేయాలంటే..లాక్ కోడ్ అవసరం ఉంటుంది. నాలుగు అంకెలతో కొత్త పాస్ వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. 
> సెట్ ఆధార్ లాక్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని..పర్చువల్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. 
> సెక్యూర్టీ క్యాప్షన్ ఎంటర్ చేసిన అనంతరం వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. అప్పుడు పర్చువల్ ఐడీ క్రియేట్ అవుతుంది. ఆధార్ లాక్‌ను ఓపెన్ చేయాలంటే పర్చువల్ ఐడీ తప్పనిసరి.
> mAadhaar యాప్ ద్వారా అందించే సేవలన్నీ కనిపిస్తాయి.