Apple WWDC 2023 : ఆఫర్ అంటే ఇది భయ్యా.. అత్యంత సరసమైన ధరకే 13 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్.. ఇప్పుడే కొనేసుకోండి..!

Apple WWDC 2023 : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? ఇప్పుడు, 13-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్‌ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. అమెజాన్‌లో MacBook బేస్ మోడల్ రూ. 1,07,990 తగ్గింపు ధరకు కొనుగోలు చేయొచ్చు.

Apple WWDC 2023 : ఆఫర్ అంటే ఇది భయ్యా.. అత్యంత సరసమైన ధరకే 13 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్.. ఇప్పుడే కొనేసుకోండి..!

MacBook Air 13-inch gets much cheaper in India, check out new price

Apple WWDC 2023 MacBook Air cheaper in India : ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2023 సందర్భంగా ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ అనేక సరికొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఆపిల్ 15-అంగుళాల స్క్రీన్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ (New Macbook Air)ను ఆవిష్కరించింది. ఈ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ లాంచ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే M2 చిప్‌తో వచ్చిన 13-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ ధర ఒక్కసారిగా పడిపోయింది. ఆపిల్  MacBook Air M2 13-అంగుళాల ధర భారీగా తగ్గింది.

కానీ, 13-అంగుళాల M1 MacBook ఎయిర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని గమనించాలి. కొత్త 15-అంగుళాల M2 మ్యాక్‌బుక్ ఎయిర్ రూ. 1,34,900 ధర ట్యాగ్‌తో వచ్చింది. 13-అంగుళాల M2 మ్యాక్‌బుక్ ఎయిర్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. భారత మార్కెట్లో 13-అంగుళాల M2 మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రెండు వేరియంట్‌లకు రూ. 5వేలు తగ్గింది. ఇప్పుడు, మీరు చిన్న డిస్‌ప్లే కోసం చూస్తుంటే.. 13-అంగుళాల మ్యాక్‌బుక్‌ని కొనుగోలు చేయడం బెటర్..

Read Also : Apple iPhone 14 Sale : అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు..!

భారత్‌లో Air M2 ధర భారీగా తగ్గింపు :
మ్యాక్‌బుక్ ధర తగ్గింపునకు ముందు.. 13-అంగుళాల M2 మ్యాక్‌బుక్ ఎయిర్ బేస్ 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,19,900కి అందుబాటులో ఉంది. ధర తగ్గింపు తర్వాత ఈ మోడల్ ధర రూ. 1,14,900 వద్ద ఉంది. 512GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర ఇప్పుడు రూ.1,44,900గా ఉంది. గతంలో ఈ మోడల్ ధర రూ.1,49,000గా నిర్ణయించింది. ఈ మ్యాక్‌బుక్ కొత్త ధరలు (Apple India) ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇప్పుడు, మీరు 13-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్‌ని కొనుగోలు చేస్తే.. థర్డ్-పార్టీ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కొనుగోలు చేయండి. (Amazon)లో, MacBook బేస్ మోడల్ రూ. 1,07,990 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 1,34,910కు సొంతం చేసుకోవచ్చు. మరోవైపు.. క్రోమా (Croma) వంటి అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో చాలా తగ్గింపు ధరలకు మ్యాక్‌బుక్‌లను విక్రయిస్తున్నాయి.

MacBook Air 13-inch gets much cheaper in India, check out new price

Apple WWDC 2023 : MacBook Air 13-inch gets much cheaper in India, check out new price

మ్యాక్‌బుక్ Air M2 టాప్ స్పెషిఫికేషన్లు ఇవే :
కొత్త MacBook Air MacBook 13 మాదిరిగా ఉంటుంది. కేవలం 15-అంగుళాల పెద్ద డిస్ప్లేతో వచ్చింది. మ్యాక్‌బుక్ ఎయిర్ 15-అంగుళాల ల్యాప్‌టాప్ సెగ్మెంట్‌లో అత్యంత సన్నని 15-అంగుళాల ల్యాప్‌టాప్ అని కంపెనీ పేర్కొంది. ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్ రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. కొత్త చిప్ MacBook Air 15-అంగుళాల బ్యాటరీని 18 గంటల వరకు అందిస్తుందని పేర్కొంది.  13-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ మాదిరిగానే M2 SoC ద్వారా పవర్ అందిస్తుంది. అత్యంత శక్తివంతమైన మ్యాక్‌బుక్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు.  ల్యాప్‌టాప్ 2880×1864 పిక్సెల్‌ల రిజల్యూషన్ (QHD+), ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్‌తో 15.3-అంగుళాల LED డిస్‌ప్లేతో వచ్చింది.

డిస్‌ప్లే 500నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఇది చాలా విండోస్-రన్నింగ్ పిసి ల్యాప్‌టాప్‌ల కన్నా 25 శాతం ప్రకాశవంతంగా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో (MagSafe) ఛార్జింగ్ పోర్ట్, థండర్ బోల్ట్ 3 పోర్ట్, USB-4 పోర్ట్, USB 3.1 Gen పోర్ట్ ఉన్నాయి. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. Wi-Fi 6, బ్లూటూత్ 5.3 సపోర్ట్, 1080p ఫేస్‌టైమ్ కెమెరా, ఫోర్స్ క్యాన్సిలింగ్ వూఫర్‌లతో కూడిన సిక్స్-స్పీకర్ సిస్టమ్ ఫోన్ కొన్ని ఇతర ముఖ్య ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త (MacBook Air) 5-అంగుళాలతో midnight, starlight, silver, space grey వంటి 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇక, ధర విషయానికొస్తే.. సాధారణ కస్టమర్లకు రూ. 1,34,900, విద్యార్థులకు రూ. 1,24,900 నుంచి అందుబాటులో ఉంటుంది.

Read Also : Apple WWDC 2023 : ఆపిల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్.. ఈ రాత్రికే లైవ్ స్ట్రీమ్ ఇలా చూడొచ్చు.. ఏయే ప్రకటనలు ఉండొచ్చుంటే?