Mangalyaan : మంగళయాన్‌‌కు ఏడేళ్లు పూర్తి..!

భారత్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ మంగళయాన్ వ్యోమనౌక ఏడేళ్లు పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ మంగళయాన్ లైఫ్ స్పాన్ కేవలం ఆరు నెలలు మాత్రమే పనిచేస్తుంది.

Mangalyaan : మంగళయాన్‌‌కు ఏడేళ్లు పూర్తి..!

Made For Mission Life Of 6 Months

Made for mission life of 6 months : భారత్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ మంగళయాన్ వ్యోమనౌక ఏడేళ్లు పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ మంగళయాన్ లైఫ్ స్పాన్ కేవలం ఆరు నెలలు మాత్రమే పనిచేస్తుంది. కానీ, ఈ మిషన్ ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు అద్భుతంగా సేవలు అందిస్తోంది. అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించి ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వ్యోమనౌక ప్రయోగ సమయంలో ఈ మంగళయాన్ మిషన్‌కు ఆయనే నేతృత్వం వహించారు.
WhatsApp : ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదట.. ఎప్పటినుంచో తెలుసా?

2013 నవంబరు 5న మంగళయాన్ మిషన్‌ను ఇస్రో ప్రయోగించింది. ఆ తర్వాతి ఏడాదిలో సెప్టెంబరు 24న అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. తొలి ప్రయత్నంలోనే అంగారకుడి కక్ష్యలోకి పంపిన మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించింది. ఆశించిన స్థాయిలో కంటే అనుకున్న లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసిందని ఇస్రో అధికారులు వెల్లడించారు. ఈ వ్యోమనౌక వ్యవస్థలు, ఉప వ్యవస్థల డిజైన్, తయారీ, వ్యోమనౌకను వేరే గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం, అంగారక కక్ష్యలో అనేక విషయాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించినట్టు ఇస్రో తెలిపింది.

రానున్న రోజుల్లో మరిన్ని అంతరిక్ష యాత్రలను చేపట్టేందుకు మరింత ప్రోత్సాహాన్ని అందించాయని ఇస్రో పేర్కొంది. ఈ వ్యోమనౌక సాయంతో ఐదు శాస్త్రీయ పరిశోధన డివైజ్‌లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొంది. ఆ డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో అధికారులు తెలిపారు. ఈ వ్యోమనౌకలోని కదిలే భాగాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంగళయాన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎం.అన్నాదురై పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ డివైజ్‌లను వినియోగించాల్సి వస్తోందని తెలిపారు. మరో ఏడాది వరకు ఈ వ్యోమనౌక పనిచేసే అవకాశం ఉందన్నారు.
West Bengal : ప్రశాంత్ కిషోర్ ఇంటి అడ్రస్ మారింది..ఎందుకు ? ఏ పార్టీ కోసం ?