Mahindra Electric : మహీంద్రా త్రివీలర్ ఎలక్ట్రిక్ ఆటో వచ్చేసింది.. ధర ఎంతంటే?

పెట్రోల్, డీజిల్ వాహనలతో విసిగిపోయారా? రోజురోజుకీ పెరిగిపోతున్న ఇంధన ధరలతో ఇబ్బంది పడుతున్నారా?

Mahindra Electric : మహీంద్రా త్రివీలర్ ఎలక్ట్రిక్ ఆటో వచ్చేసింది.. ధర ఎంతంటే?

Mahindra Launches Electric

Mahindra electric Auto : పెట్రోల్, డీజిల్ వాహనలతో విసిగిపోయారా? రోజురోజుకీ పెరిగిపోతున్న ఇంధన ధరలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఇదే సరైన సమయం.. ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి.

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ కార్లను చూశాం.. ఎలక్ట్రిక్ బైకులను చూశాం.. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో కూడా వచ్చేసింది.. త్రివీలర్ ఎలక్ట్రిక్ ఆటోను ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Mahindra & Mahindra సబ్సిడరీ కంపెనీల్లో ఒకటైన Mahindra Electric Mobility కంపెనీ ప్రవేశపెట్టింది.

ఆల్ఫా కార్గో పేరుతో త్రీవీలర్‌ EV సెగ్మెంట్‌లోకి మహీంద్రా గ్రూపు ఎంట్రీ ఇచ్చింది. 2022 జనవరి 18న ఈ ఆల్ఫా కార్గోను భారత మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది మహీంద్రా కంపెనీ. ఈ త్రివీలర్ ఎలక్ట్రిక్ ఆటో దేశ రాజధాని (ఢిల్లీలో ఎక్స్‌షోరూం) ధర 1.44 లక్షలుగా ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ త్రివీలర్ ఎలక్ట్రిక్ ఆటోను ఒకసారి ఛార్జ్‌ చేస్తే 310 కిలోల లోడుతో 80కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకి 25 కిలోమీటర్లుగా కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

మహీంద్రా త్రివీలర్ ఎలక్ట్రిక్ ఆల్ఫా ఆటోను 48 V/15 A ఛార్జర్ సాయంతో మీ.. మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకున్నంత సులభంగా ఛార్జ్‌ చేసుకోవచ్చునని మహీంద్రా కంపెనీ అంటోంది. ఇంధన ధరలు అమాంతం పెరిగిపోవడంతో నగర ప్రాంతాల్లో కార్గో సేవలు తగ్గిపోయాయి. ఇకపై ఎలక్ట్రిక్ ఆల్ఫా ఆటోతో ఆ ససమ్య కూడా తీరిపోతుందని మహీంద్రా కంపెనీ అంటోంది. మహీంద్రా పోర్ట్ పోలియోలో ఈ ఆల్ఫా మినీ ఆటో కూడా ఉంది.

Read Also : Actress Dressing: ట్రోలింగ్.. నెటిజన్స్ చేత తిట్లు తింటున్న స్టార్ హీరోయిన్లు!