Twitter: దిగొచ్చిన ట్విట్టర్.. కేంద్రం రూల్స్‌పై పాజిటివ్ రియాక్షన్

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను పాటించేందుకు ససేమిరా అంటూ మొండికేసిన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్‌.. ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్రం చివరి అవకాశం ఇస్తూ రాసిన ఘాటు లేఖకు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది.

Twitter: దిగొచ్చిన ట్విట్టర్.. కేంద్రం రూల్స్‌పై పాజిటివ్ రియాక్షన్

Twitter

Twitter To Centre: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను పాటించేందుకు ససేమిరా అంటూ మొండికేసిన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్‌.. ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్రం చివరి అవకాశం ఇస్తూ రాసిన ఘాటు లేఖకు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది. భారత చట్టాలకు కట్టుబడి ఉండేందుకు అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తూ.. అందుకు కొంత సమయం కావాలని కోరింది.

భారత కొత్త ఐటీ నిబంధనల అమలుకు సంబంధించిన ప్రతీ చర్యను తీసుకుంటున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. ఈ మేరకు భారత్‌లో గ్రీవెన్స్‌, నోడల్‌ అధికారులను నియమించినట్లు తెలిపింది. చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్‌ను నియమించే ప్రక్రియ తుది దశలో ఉందని స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి
లేఖ రాసింది. ఫిబ్రవరి 25న ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను నోటిఫై చేసినట్లు ట్విట్టర్‌ గుర్తుచేసింది. కానీ, మహమ్మారి విజృంభిస్తుండడంతో వెంటనే ఏర్పాట్లు చేసుకోవడం సాధ్యం కాలేదని వివరించింది.

కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు భారత్‌లో ఓ అధికారిని ట్విట్టర్ నియమించాల్సి ఉంటుంది. దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది కలిగించే సందేశాలేమైనా ఉంటే వాటి మూలాల వివరాలను ప్రభుత్వం లేదా న్యాయస్థానం అడిగితే తెలపవల్సి ఉంటుంది.