Beer Bike : బీర్ తో నడిచే బైక్.. గంటకు 240 కిలోమీటర్ల స్పీడ్

బైక్ లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్ ను 300 డిగ్రీల వరకూ మండిస్తుందని, దీంతో నాజిల్స్ లో ఆవిరి జనరేట్ అవడంతో బైక్ ముందుకు కదులుతుందని మైఖేల్సన్ వెల్లడించారు.

Beer Bike : బీర్ తో నడిచే బైక్.. గంటకు 240 కిలోమీటర్ల  స్పీడ్

Beer Bike

America Beer Bike : సాధారణంగా బైక్ పెట్రోల్ తో నడుస్తోంది. కానీ, ఇప్పుడు బీర్ తో నడిచే బైక్ కూడా వచ్చేంది. అమెరికాకు చెందిన మైఖేల్సన్ బీర్ తో నడిచే బైక్ ను ఆవిష్కరించారు. గతంలో రాకెట్ తో నడిచే టాయిలెట్, జెట్ తో నడిచే కాఫీ పాట్ ను కనుగొన్న మైఖేల్సన్ తాజాగా బీర్ తో నడిచే బైక్ ను ఆవిష్కరించడం అందరినీ ఆకట్టుకుంటోంది.

బైక్ లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్ ను 300 డిగ్రీల వరకూ మండిస్తుందని, దీంతో నాజిల్స్ లో ఆవిరి జనరేట్ అవడంతో బైక్ ముందుకు కదులుతుందని మైఖేల్సన్ వెల్లడించారు. ఈ బైక్ గంటకు 240 కిలో మీటర్ల వేగంతో దూసుకెళుతుందని పేర్కొన్నారు.

Bard vs ChatGPT : గూగుల్ బార్డ్ ఏఐ, చాట్‌జీపీటీ ఒక్కటేనా? రెండింటి మధ్య తేడా ఏంటి? ఏఐ చాటా‌బాట్స్ ఎలా పనిచేస్తాయి? అందరికి ఉచితమేనా?

తాను కనిపెట్టిన మోటార్ సైకిల్ వినూత్న ఆవిష్కరణగా నిలుస్తుందని ఫాక్స్ 9 తో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. గ్యాస్ ధర రోజు రోజుకూ ఎగబాకుతోందని, తాను డ్రింక్ చేయనని అందుకే దీన్ని ఇంధనంగా మార్చి మెరుగ్గా వినియోగించుకోవాలని ఆలోచించానని తెలిపారు.

రాకెట్ మ్యాన్ గా పేరొందిన మైఖేల్సన్ ఈ బైక్ ను ఇంత వరకూ రోడ్డు మీదకు తీసుకు వెళ్లలేదు. స్థానిక కార్ షోస్ లో పాల్గొన్న బీరుతో నడిచే వాహనం ఆ షోస్ లో మొదటి స్థానంలో నిలిచింది. కొన్ని ప్రదర్శనల అనంతరం తన ఇంటిలోని మ్యూజియంలో ఈ బైక్ ను ఉంచుతానని పేర్కొన్నారు.