Planetary Conjunction : ఖగోళంలో అద్భుతం.. ఈనెల 12,13 తేదీల్లో అతి చేరువగా కుజ,శుక్ర,చంద్రులు

ఖగోళంలో ఈనెల 12,13 తేదీల్లో అద్భుతం జరగనుంది. భూమికి పొరుగున ఉన్న కుజ, శుక్ర గ్రహాలు ఒకదానికి ఒకటి అతి చేరువగా వచ్చి ఖగోళశాస్త్ర ప్రియులకు కనువిందు చేయనున్నాయి.

Planetary Conjunction : ఖగోళంలో అద్భుతం.. ఈనెల 12,13 తేదీల్లో అతి చేరువగా కుజ,శుక్ర,చంద్రులు

Mars, Venus, With Moon Conjunction (2)

Planetary Conjunction: ఖగోళంలో ఈనెల 12,13 తేదీల్లో అద్భుతం జరగనుంది. భూమికి పొరుగున ఉన్న కుజ, శుక్ర గ్రహాలు ఒకదానికి ఒకటి అతి చేరువగా వచ్చి ఖగోళశాస్త్ర ప్రియులకు కనువిందు చేయనున్నాయి. అదే సమయంలో చందమామ కూడా వీరికి దగ్గరగా కనిపిస్తాడు.

ఎటువంటి సాధనాలు లేకుండానే ఈమూడు గ్రహలను ఖగోళం లో వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఆయా గ్రహాల కక్ష్య దృష్ట్యా అరుదైన సందర్భాల్లో అవి భూమి నుంచి చూసినప్పుడు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. పరస్పరం అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు కుజ, శుక్రుల మధ్య ఎడం 0.5 డిగ్రీల మేర మాత్రమే ఉంటుంది.

ఈ రెండు గ్రహాలు, చందమామ.. పరస్పరం దగ్గరకు వచ్చే ప్రక్రియ గురువారం  8వ తేదీ నుంచే కనపడుతుంది.  13న మరింత దగ్గరగా కనిపిస్తాయి. జులై 8వతేదీ రాత్రి నుంచి ఖగోళ ప్రియులు ఆకాశంలో ఈ అధ్బుతాన్ని వీక్షించవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తెలియచేసింది.

వీటిలో రెండు గ్రహాలను ఎటువంటి టెలిస్కోపులు, బైనాక్యులర్ ల అవసరం లేకుండానే వీక్షించవచ్చని.. భారత దేశంలో ఎక్కడి నుంచైనా వీటిని వీక్షించవచ్చని తెలిపింది. జులై 13 తర్వాత అవి క్రమంగా దూరం అవుతాయని భావిస్తున్నారు.