మారుతీనా మజాకా : ఇది మారుతీ 800 లాంబోర్గనీ.. స్పోర్ట్స్ కారులా లగ్జరీ లుక్‌..

మారుతీనా మజాకా : ఇది మారుతీ 800 లాంబోర్గనీ.. స్పోర్ట్స్ కారులా లగ్జరీ లుక్‌..

Maruti 800:మారుతి.. ఈ పేరు వినగానే.. మిడిల్ క్లాస్ బడ్జెట్‌ కార్ల తయారీ కంపెనీ అని చెప్పేయచ్చు. ఇప్పుడు ఆ కంపెనీకి చెందిన మారుతి 800 కొత్తరకం మోడల్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మారతీ 800ను లగ్జరీ లుక్‌లో మోడిఫై చేసేశారు చూడండి.. అచ్చం హైబ్రిడ్ హోండా 660, లాంబోర్గనీ కారు మోడల్ మాదిరిగా స్పోర్ట్స్ కారులా అదిరిపోతోంది. మారుతి అల్టో 800 మోడల్ కు ముందు అత్యంత చౌకైన కారు ఇది.. కానీ, అన్నింట్లో మారుతి 800 మంచి లీడ్ లో దూసుకుపోతోంది.

మారుతి నుంచి ఎన్నో అప్ గ్రేడ్ కార్లు వచ్చినా ఈ మారుతి 800 మోడల్ మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను ఫిదా చేస్తోంది. కొత్త మార్కెట్లోనూ ఇలాంటి కారు మోడళ్లకు ఫుల్ క్రేజ్ ఉందనే చెప్పాలి.. అలాంటి పాత మారుతి 800 మోడల్ ను స్పోర్ట్స్ కారులో మోడిఫై చేశారు..

అచ్చం హైబ్రిడ్ వెర్షన్ హోండా 660, లాంబోర్గనీ మోడల్ మాదిరిగా లగ్జరీ లుక్ లో మెరిసిపోతోంది.. నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది.. ప్రాజెక్టర్ టైపు ఎల్ఈడీ డీఆర్ఎల్ రింగులు, స్టాక్ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ సైడులో బంపర్, డోర్ ప్యాడ్ లు, సీటు కవర్లు, భారీగా మెటల్ తో మోడిఫై చేశారు. ఒరిజినల్ ఇంజిన్ అలానే మిగతావన్నీ మోడిఫై చేశారు..

ఈ మారుతీ 800 లాంబోర్గనీ కొత్త మోడల్ వీడియో ఒకటి యూట్యూబ్ ఛానల్ లో తెగ హల్ చల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మోడిఫై చేసిన కార్ల వీడియోలలో మారుతీ 800 స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ కారులో మెటల్ సీట్లతో మార్చేశారు. అసలైన మారుతీ 800 కంటే కొత్త లుక్ లో ట్రెండీగా కనిపిస్తోంది. స్పోర్ట్స్ లుక్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.