Maruti Suzuki Cars: మారుతి కంపెనీ కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే అలర్ట్..

maruti suzuki cars : మీరు మారుతి కంపెనీ కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ బడ్జెట్‌ను కొద్దిగా పెంచాల్సి ఉంటుంది. వాస్తవానికి, ఈ రోజు నుండి కంపెనీ కొన్ని మోడళ్ల ధరలను పెంచింది. దీంతో వినియోగదారులు ఇప్పుడు కారు కొనడానికి

Maruti Suzuki Cars: మారుతి కంపెనీ కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే అలర్ట్..

Maruti Suzuki Cars

maruti suzuki cars : మీరు మారుతి కంపెనీ కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ బడ్జెట్‌ను కొద్దిగా పెంచాల్సి ఉంటుంది. వాస్తవానికి, ఈ రోజు నుండి కంపెనీ కొన్ని మోడళ్ల ధరలను పెంచింది. దీంతో వినియోగదారులు ఇప్పుడు కారు కొనడానికి రూ. 22,500 వరకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త ధరలు నేటి నుండి అమల్లోకి వచ్చినట్టు కంపెనీ తెలిపింది. అయితే, ఈ కొత్త ధరలను ఎంపిక చేసిన మోడళ్లకు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. గత ఒక సంవత్సరంలో, ఉక్కు ధరలు 50% పెరిగాయని.. దాంతో కారులో ఉపయోగించే సెమీకండక్ట్ నుండి ఇతర భాగాలు కూడా ఖరీదైనవిగా మారాయని అందువల్లే కార్ల ధరలు పెరిగాయని పేర్కొంది.

భోపాల్‌లోని ఆర్‌ఎంజె షోరూమ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆల్టో రూ .12,500 వరకు పెరిగింది. అదే సమయంలో ఎర్టిగా ధరను రూ .22,500 పెంచారు. మినీ ఎస్‌యూవీ, ఎస్-ప్రీసో అని పిలిచే ఈ కారు ఇప్పుడు రూ .7,500 ఖరీదైనది. గత సంవత్సరమే ధరలను పెంచాలని భావించినప్పటికీ.. గత సంవత్సరం మార్కెట్ పరిస్థితి బాగాలేని కారణంగా పెంపు నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ ఏడాది ధర పెంచక తప్పని పరిస్థితి అని కంపెనీ వెల్లడించింది.

జనవరి 18న మారుతి సుజుకి ఇండియా తన కార్ల ధరను రూ .34,000 పెంచింది. ఆ సమయంలో దాదాపు అన్ని కంపెనీలు వాటి ధరలను పెంచాయి. అప్పుడు కూడా ముడి పదార్థాల ధరలు పెరిగాయని కంపెనీ తెలిపింది. అయితే 3 నెలల వ్యవధిలో రెండవసారి మారుతి కంపెనీ ధరలను పెంచింది. గత నెలలో మొత్తం 1,72,433 యూనిట్ల కార్లను ఉత్పత్తి చేసినట్లు పేర్కొంటూ కంపెనీ 2021 మార్చిలో కార్ల ఉత్పత్తి గణాంకాలను విడుదల చేసింది. కాగా కంపెనీ గత ఏడాది ఇదే నెలలో 92,540 యూనిట్ల కార్లను ఉత్పత్తి చేసింది.