Maruti Suzuki : కార్ల ధరలు పెంచిన మారుతి సుజుకీ

గత కొద్దీ రోజులుగా వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. కరోనా కారణంగా సుమారు 14 నెలల పాటు అమ్మకాలు మందకొడిగా ఉండటంతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి ఆటో మొబైల్ కంపెనీలు. ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు తొలగించారు. దీంతో కార్లు, బైకులతోపాటు వాణిజ్య వాహనాల అమ్మకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం విక్రయాలు పెరగడంతో తిరిగి లాభాల బాట పడుతున్నాయి.

Maruti Suzuki : కార్ల ధరలు పెంచిన మారుతి సుజుకీ

Maruti Suzuki (2)

Maruti Suzuki : గత కొద్దీ రోజులుగా వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. కరోనా కారణంగా సుమారు 14 నెలల పాటు అమ్మకాలు మందకొడిగా ఉండటంతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి ఆటో మొబైల్ కంపెనీలు. ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు తొలగించారు. దీంతో కార్లు, బైకులతోపాటు వాణిజ్య వాహనాల అమ్మకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం విక్రయాలు పెరగడంతో తిరిగి లాభాల బాట పడుతున్నాయి.

ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని కంపెనీలు తమ వాహనాల రేట్లను పెంచుతున్నాయి. ముడిపదార్ధాలు రేట్లు పెరడగం వల్లనే వాహనాల రేట్లను పెంచాల్సి వస్తుందని ఆటో మొబైల్ కంపెనీలు చెబుతున్నాయి. ఇక తాజాగా ఆటో మొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ సీఎన్‌జీ కార్ల ధరను భారీగా పెంచింది. దీంతోపాటు స్విఫ్ట్‌ కారు ధరలో మార్పులు చేసింది. పెంపు అత్యధికంగా రూ.15,000 వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

పెరిగిన ధరలు నేటినుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇక పెట్రోల్‌ కార్ల ధరలను కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇతరకార్ల ధరల్లో మార్పుల విషయాన్ని పరిశీలిస్తున్నాం. త్వరలోనే వెల్లడిస్తాం” అని ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ఆల్టో, ఎస్‌ప్రెస్సో, సెలిరియో, వేగనార్‌, ఎకో, ఎర్టిగా మోడళ్లు మాత్రమే సీఎన్‌జీ విభాగంలో విక్రయిస్తోంది. స్విఫ్ట్‌, డిజైర్‌, బ్రెజా మోడళ్లు కేవలం పెట్రోల్‌ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తాయి.