Massive Discounts on iPhones : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏయే ఐఫోన్ మోడళ్లపై ఎంతవరకు డిస్కౌంట్ ఉండొచ్చుంటే?

Massive Discounts on iPhones : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్ 14న జరిగిన ఫార్ అవుట్ ఈవెంట్‌ (Apple Far Out Event)లో iPhone 14 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈసారి Apple ఈవెంట్‌లో మూడు డివైజ్‌లకు బదులుగా నాలుగు మోడళ్లను లాంచ్ చేసింది.

Massive Discounts on iPhones : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏయే ఐఫోన్ మోడళ్లపై ఎంతవరకు డిస్కౌంట్ ఉండొచ్చుంటే?

Massive Discounts on iPhones : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్ 14న జరిగిన ఫార్ అవుట్ ఈవెంట్‌ (Apple Far Out Event)లో iPhone 14 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈసారి Apple ఈవెంట్‌లో మూడు డివైజ్‌లకు బదులుగా నాలుగు మోడళ్లను లాంచ్ చేసింది. ఈ ఏడాది Apple ఈవెంట్‌లో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Maxలను ఆవిష్కరించింది. మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ సిరీస్‌లో ఎవరినైనా కొనుగోలు చేయవచ్చు. కానీ, మీ బడ్జెట్ రూ. 50వేల కన్నా ఎక్కువ లేకపోతే.. మీరు ఇప్పటికీ ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Massive discounts on iPhone 13, iPhone 12 and iPhone 11 on Flipkart after iPhone 14 launch

Massive discounts on iPhone 13, iPhone 12 and iPhone 11 on Flipkart after iPhone 14 launch

మీరు ఫ్లిప్‌కార్ట్‌లో అందించనున్న డీల్‌లను ఓసారి చెక్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ఈ-కామర్స్ దిగ్గజం బ్యాంకు ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లతో కూడిన పాత ఐఫోన్‌పై డీల్‌లను ఆఫర్ చేస్తోంది. మీరు సేల్ మొదలయ్యేవరకు ఉండలేకపోతున్నారా? మీరు వెంటనే ఆఫర్‌లను చెక్ చేయవచ్చు.

ఐఫోన్ 11 (iPhone 11) :
ఆపిల్ ఐఫోన్ 11 డివైజ్ పాతది అయినప్పటికీ.. మీ బడ్జెట్ రూ. 30వేల లోపు ఉంటే.. iPhone 11 ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో (64GB వేరియంట్) స్మార్ట్‌ఫోన్ రూ. 43,900 వద్ద లిస్టు అయింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ మీ పాత ఫోన్‌కు బదులుగా రూ.19వేల వరకు ఆఫర్ చేస్తోంది. మీ పాత ఫోన్ చాలా గుడ్ కండిషన్‌లో ఉంటే ధర దాదాపు రూ. 10వేల వరకు తగ్గుతుంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ యూజర్లు ఈ డివైజ్‌పై 5 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Massive discounts on iPhone 13, iPhone 12 and iPhone 11 on Flipkart after iPhone 14 launch

Massive discounts on iPhone 13, iPhone 12 and iPhone 11 on Flipkart after iPhone 14 launch

ఐఫోన్ 12 (iPhone 12) :
ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌తో వచ్చిన iPhone 12 మోడల్ (128GB వేరియంట్) ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 64,900కి అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ద్వారా మీ ఫోన్‌కి బదులుగా రూ.19వేల వరకు తగ్గింపు ధరకు పొందవచ్చు. అదనంగా, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ యూజర్లు ఫోన్‌పై 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఈ iPhone 12 ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

Massive discounts on iPhone 13, iPhone 12 and iPhone 11 on Flipkart after iPhone 14 launch

Massive discounts on iPhone 13, iPhone 12 and iPhone 11 on Flipkart after iPhone 14 launch

ఐఫోన్ 13 (iPhone 13) :
ఐఫోన్ 14, ఐఫోన్ 13 మధ్య డిజైన్, ఫీచర్లలో ఎలాంటి తేడా లేదు. అయితే ఈ రెండు ఫోన్ల ధర మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. ఐఫోన్ 13 రూ.69,900కి సేల్ అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా రూ.19వేల వరకు అందిస్తోంది. మీరు iPhone 11ని కలిగి ఉంటే.. రూ. 18,000 లేదా అంతకంటే ఎక్కువ పొందవచ్చు. దీంతో ధర రూ.50 నుంచి రూ.900కి పడిపోయింది.

మీరు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వరకు వేచి ఉండలేరా? అయితే ఐఫోన్ 13 ధర దాదాపు రూ. 20వేల తగ్గుతుందని భావిస్తున్నారు. ఐఫోన్ 13 ధర రూ. 49,900 వరకు ఉండవచ్చని ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే వెల్లడించింది. కానీ, ఇది లిమిటెడ్ పిరియడ్ డీల్ మాత్రమేనని గమనించాలి.

Read Also : iPhone 14 Home Delivery In India : ఐఫోన్ 14 సిరీస్ కొనేందుకు చూస్తున్నారా..? ఇలా ఆర్డర్ చేస్తే.. కేవలం 30 నిమిషాల్లోపే హోం డెలివరీ.. అదేలా అంటారా?!