రిలీజ్ కు ముందే లీక్: ఎట్రాక్ట్ చేస్తున్న ‘Meizu నోట్ 9’ ఫీచర్లు
ప్రముఖ చైనా మొబైల్స్ తయారీదారు సంస్థ మెయ్‌జు కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లలోకి రానుంది. అదే మొయ్ జు నోట్9.

ప్రముఖ చైనా మొబైల్స్ తయారీదారు సంస్థ మెయ్‌జు కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లలోకి రానుంది. అదే మొయ్ జు నోట్9.
ఏదైన కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ కాక ముందే ఫీచర్లు లీక్ అవుతున్నాయి. రిలీజ్ అయ్యే ఫోన్ ధర ఎంత.. ఫీచర్లు ఎలా ఉంటాయో ముందుగానే యూజర్లకు తెలిసిపోతున్నాయి. దీంతో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కు ముందే మార్కెట్లో ఫోన్ క్రేజ్ పెరిగిపోతుంది. ఇప్పటివరకూ ఐఫోన్ నుంచి ఎన్నో స్మార్ట్ ఫోన్ల ఫీచర్లు రిలీజ్ కు ముందే లీకయ్యాయి. ప్రముఖ చైనా మొబైల్స్ తయారీదారు సంస్థ మెయ్‌జు కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లలోకి ప్రవేశపెట్టనుంది. Meizu Note 9 కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లలో విడుదలకు సన్నాహాలు చేస్తోంది.
ఈ ఫోన్ భారత మార్కెట్లలో రిలీజ్ అవ్వడానికి ముందే దీని ఫీచర్లు లీకయ్యాయి. M923Q అనే మోడల్ నెంబర్ తో మెయ్ జు నోట్ 9 ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. చైనీస్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (TENAA) ప్లాట్ ఫాం వెబ్ సైట్ లో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ కొత్త ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు. ధర ఎంత ఉంటుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.
TENAA వెబ్ సైట్ లో లీకైన ఈ స్మార్ట్ ఫోన్ కీ స్పెషిఫికేషన్లు యూజర్లను యాట్రాక్ట్ చేసేలా కనిపిస్తున్నాయి. టీయర్ డ్రాప్ నాచ్ తో వస్తోన్న ఈ కొత్త మొయ్ జు నోట్ 9 ఫోన్ పై నాజుగ్గా కనిపించే 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లే ఆకర్షించేలా ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 675 SoC ప్రాసెసర్, 4000 MAH బ్యాటరీ, మైక్రో SD స్లాట్, సెల్ఫీ కెమెరా, 48 మెగా రియల్ కెమెరాలు ఇలా మరెన్నో ఫీచర్లు యూజర్లను మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
Full Key Specifications
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్
* 6 జీబీ ర్యామ్
* 64/128 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్
* 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్,
* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లే
* డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0
* USB టైప్ సి
* 4000 MAH బ్యాటరీ
* ఫాస్ట్ చార్జింగ్