Messenger Chats : వీడియో చాట్ కన్నా మెసేంజర్ చాట్స్ ముద్దు.. అందరిని దగ్గరకు చేర్చాయి!

అసలే కరోనా కాలం.. మహమ్మారి మాటువేసిన ఈ ప్రపంచంలో ఒకప్పటిలా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. వ్యాక్సిన్లు వచ్చినా వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో అందరిని భౌతికంగా కలవడం దాదాపు కష్టమైపోయింది.

Messenger Chats : వీడియో చాట్ కన్నా మెసేంజర్ చాట్స్ ముద్దు.. అందరిని దగ్గరకు చేర్చాయి!

Messenger Chats Bring People Closer Than Video Chat

Messenger chats bring people closer than video chat : అసలే కరోనా కాలం.. మహమ్మారి మాటువేసిన ఈ ప్రపంచంలో ఒకప్పటిలా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. వ్యాక్సిన్లు వచ్చినా వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో అందరిని భౌతికంగా కలవడం దాదాపు కష్టమైపోయింది. అందుకే వర్చువల్‌గా ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. అందులోనూ జూమ్ వంటి వీడియో చాటింగ్ ద్వారా మరింత దగ్గరయ్యారు. కానీ, ఓ అధ్యయనం ప్రకారం.. రీసెర్చర్లు ఒక విషయాన్ని వెల్లడించారు.

వీడియో చాట్ కన్నా మెసేంజర్ యాప్ చాట్స్ ద్వారానే ఎక్కువగా అందరిని దగ్గర చేశాయని తెలిపారు. అది కుటుంబ సభ్యులు కావొచ్చు.. స్నేహితులు ఇలా అందరికి వేదికలా మారాయని రీసెర్చర్లు పేర్కొన్నారు. వీడియో చాటింగ్ అనేది విజువల్ గా ఒకరినొకరిని దగ్గర చేస్తుంది. కానీ, ప్రాక్టికల్ గా చూస్తే.. బయటి ప్రపంచంలోని వారంతా మహమ్మారి సమయంలో మెసేంజర్ యాప్ లైన వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ చాట్ల ద్వారానే ఎక్కువగా దగ్గరయ్యారని కొత్త అధ్యయనం తెలిపింది.

ఈ అధ్యయనాన్ని అంతర్జాతీయ జనరల్ ఆఫ్ సైకాలజీలో ప్రచురించారు. వీడియో కాన్ఫెరెన్సల కంటే.. మెసేంజర్ల ద్వారా పంపే షార్ట్ మెసేజ్‌ల్లో టెక్స్ట్ లేదా వీడియోలతోనే ఎక్కువగా దగ్గరయ్యారట.. టెక్స్ట్ మెసేజ్ తొందరగా రీచ్ అవుతుంది. ఇదే ఫీల్ పంపినవారిలోనూ కలుగుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. వాస్తవానికి వీడియో కాల్స్.. ఎక్కువగా ఒత్తిడికి లోనుచేస్తాయని అంటున్నారు. అదే టెక్ట్స్ ఆధారిత కమ్యూనికేషన్ ద్వారా పరోక్షంగా ఎక్కువ సంతృప్తిని కలిగించినట్టు అధ్యయనంలో పేర్కొన్నారు.