Meta verified: ట్విటర్ బాటలో మెటా.. ఇకనుంచి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు డబ్బులు కట్టాల్సిందే ..!
2022లో అంతర్జాతీయ మాంద్యం, యాపిల్ ఐఓఎస్ గోప్యతా విధానం మార్పుల కారణంగా ప్రకటనల రాబడి తగ్గింది. దీంతో ఆదాయాన్ని పెంచుకొనేందుకు మెటా వెరిఫైడ్ పేరుతో చెల్లింపు ధృవీకరణ సేవలను ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా అందుబాటులోకి తేచ్చింది.

Meta verified
Meta verified: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్ బాటలో పయణించేందుకు సిద్ధమైంది. ట్విటర్ బ్లూటిక్ తరహాలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు బ్లూటిక్ ఖాతాదారుల నుంచి ఇకపై ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. గత సంవత్సరం ట్విటర్ బ్లూ సబ్‌స్ర్కిప్షన్‌ను ప్రారంభించిన విషయం విధితమే. తాజాగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా ట్విటర్ బాటలో నడవనున్నాయి. ఇందుకోసం మెటా చెల్లింపుల సేవ ‘మెటా వెరిఫైడ్’ను అందుబాటులోకి తేనుంది. అయితే, ఇక్కడ ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఫేస్‌బుక్ దాని ధృవీకరణ సబ్‌స్క్రిప్షన్ సేవకు నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం, ట్విటర్ బ్లూటిక్ కంటే ఎక్కువ ధరను నిర్ణయించడం గమనార్హం.
Twitter Blue Tick : ట్విట్టర్ ఆండ్రాయిడ్ యూజర్లు రూ.900లకే బ్లూ టిక్ మార్క్ కొనుగోలు చేయొచ్చు!
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తొలుత ‘మెటా వెరిఫైడ్’ సేవలను న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో ప్రారంభించింది. ఇందుకోసం వెబ్ యూజర్ల నుంచి నెలకు 11.99డాలర్లు, ఐఓఎస్ యూజర్ల నుంచి నెలకు 14.99 డాలర్లు వసూలు చేయనుంది. అయితే ఆండ్రాయిడ్ పై ఈ సేవలకు సంబంధించి ఎంత వసూళు చేస్తారన్న విషయంపై స్పష్టత రాలేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తరువాత మిగిలిన దేశాల్లో ఈ సేవలను మెటా అందుబాటులోకి తేనుంది.
Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ చాలా ఈజీ.. బ్యాడ్జ్ కోసం అప్లయ్ చేసుకోండిలా..!
2022లో అంతర్జాతీయ మాంద్యం, యాపిల్ ఐఓఎస్ గోప్యతా విధానం మార్పుల కారణంగా ప్రకటనల రాబడి తగ్గింది. దీంతో ఆదాయాన్ని పెంచుకొనేందుకు మెటా ఈ విధానాన్ని అవలంభించనుంది. నెలవారీ చందా చెల్లించినవారికి ప్రభుత్వ ధృవీకరణ ప్రకారమే ఖాతాకు బ్లూ బ్యాడ్జ్ కేటాయిస్తారు. సబ్‌స్క్రిప్షన్ ఉన్న అకౌంట్లను నకిలీల బెడద లేకుండా ఫేస్‌బుక్ అదనపు భద్రత కల్పిస్తోంది. అంతేకాదు, ఏదైనాసమస్య ఉత్పన్నమైతే నేరుగా కస్టమర్ కేర్ ను సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది.