పేటీఎం-గూగుల్ పే తరహాలో : జియోమీ ‘MI Pay’ వచ్చేసింది

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోమీ డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి అడుగుపెట్టింది.

  • Published By: sreehari ,Published On : March 19, 2019 / 08:49 AM IST
పేటీఎం-గూగుల్ పే తరహాలో : జియోమీ ‘MI Pay’ వచ్చేసింది

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోమీ డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి అడుగుపెట్టింది.

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోమీ డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకూ UPI ఆధారంగా పేమెంట్స్ సిస్టమ్ తో సేవలు అందిస్తోన్న పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్ ఇన్ బుల్ట్ పేమెంట్స్ సిస్టమ్ తరహాలో జియోమీ కూడా కొత్త డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అదే.. ఎమ్ఐ పే (MI pay). జియోమీ ఎంఐ పే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ను తొలిసారి ఇండియాలో ప్రవేశపెట్టింది.
Read Also : వాట్సాప్‌లో కొత్త ఫీచర్ : ఫేక్ న్యూస్‌ను పట్టేస్తుంది

2018 డిసెంబర్ లోనే జియోమీ ఎంఐ పే యాప్ ను బీటా మోడ్ వర్షన్ లో లాంచ్ చేసింది. ఇప్పడు అన్ని ఆండ్రాయిడ్ వర్షన్లలో కూడా ఎంఐ పే డిజిటల్ పేమెంట్ యాప్ సపోర్ట్ చేయనుంది. MI pay యాప్ త్వరలో ఎమ్ఐ యాప్స్ స్టోర్ లో కూడా అందుబాటులోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్యంతో జియోమీ ICICI బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుని ఇండియాలో లాంచ్ చేసింది.

ఇక బిల్లు పేమెంట్స్ చెల్లించండిలా :
ఎమ్ఐ పే యూజర్లు.. UPI ఐడీ, బ్యాంకు అకౌంట్ల ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అంతేకాదు.. యూజర్ల కోసం జియోమీ.. QR కోడ్ ఆప్షన్ కూడా అందిస్తోంది. ఇతర డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ లో అందుబాటులో ఉన్న అన్ని సేవలను జియోమీ ఎమ్ఐ పే నుంచి యూజర్లు పొందొచ్చు. యూజర్లు తమ మొబైల్, వాటర్, పవర్ బిల్లు, గ్యాస్ బిల్లు, డీటీహెచ్, ల్యాండ్ లైన్, బ్రాండ్ బ్యాండ్ బిల్లులను ఎమ్ఐ పే యాప్ ద్వారా చెల్లించవచ్చు. బిల్లుల చెల్లింపునకు సంబంధించి జియోమీ ఎమ్ఐ పే యాప్ లో ఇప్పటికే అస్సాం పవర్, బెస్ట్ ముంబై, బీఎస్ఈఎస్ రాజధాని, యుమునా వంటి పలు సర్వీసులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటర్ నెట్ సౌకర్యం అందించే సర్వీసుల్లో ఏసియా నెట్, హాత్ వే, నెక్సట్రా బ్రాడ్ బ్యాండ్ సర్వీసులతో కూడా జియోమీ టైఅప్ అయింది. 
Read Also : IRCTC టికెట్ బుకింగ్ కొత్త రూల్స్ : సమ్మర్‌లో మ్యారేజీ, హాలీడే ట్రిప్‌కు వెళ్తున్నారా?

జియోమీ కస్టమ్ OS, MIUIతో ఇంటిగ్రేటెడ్ అయిన ఎమ్ఐ పే యాప్ ద్వారా యూజర్లు నేరుగా బ్యాంకు అకౌంట్ల ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. ఇందుకోసం మీ ఫోన్ కాంటాక్ట్ లిస్టు, SMS, స్కానర్ యాప్ లతో చెల్లింపులు చేయొచ్చు. ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎంలో కూడా ఇలాంటి ఫీచర్ అందుబాటులో ఉంది. పేటీఎంలో డైరెక్ట్ పే ఆప్షన్ కాంటాక్ట్ లిస్టులో ఎనేబుల్ అయి ఉంది. 

షాపింగ్ చేసేయండిలా..
అంతేకాదు.. ఎమ్ఐ పే యూజర్లు mi.com పేమెంట్ ఫీచర్ నుంచి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాం లాగే ఎమ్ఐ పే యాప్ కూడా సెక్యూర్ కలిగి ఉందని, చెల్లింపుల భద్రత విషయంలో EY, LUCIDEUS నుంచి ఆమోదం పొందినట్టు జియోమీ తెలిపింది. యూజర్ల డేటా భద్రతా కోసం ఇండియాలోనే యూజర్ల డేటాను ఎమ్ఐ పే భద్రపరచున్నట్టు స్పష్టం చేసింది. ఎమ్ఐ పే యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేదానిపై జియోమీ వెల్లడించలేదు. 

ఇండియాలో న్యూ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ అందిస్తోన్న జియోమీ ఎమ్ఐ పే యాప్ ను ప్రవేశపెట్టింది. జయోమీ అందించే తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లలో లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే.  

Mi ఫ్యాన్స్ కు బిగ్ సర్ ఫ్రైజ్..
ఎమ్ఐ ఫ్యాన్స్ కు ఓ బిగ్ సర్ ఫ్రైజ్ అందిస్తోంది… ఎమ్ఐ పే యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసిన యూజర్లు రెడ్ మి నోట్ 7, MiTV 4ఎ ప్రొ 32 కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది.