MI సేల్స్ డేస్ : అమెజాన్‌లో అమేజింగ్ డిస్కౌంట్స్

  • Published By: madhu ,Published On : September 5, 2019 / 12:11 PM IST
MI సేల్స్ డేస్ : అమెజాన్‌లో అమేజింగ్ డిస్కౌంట్స్

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ MI days సేల్ పేరిట షియోమి, రెడ్‌మి స్మార్ట్ ఫోన్లపై అమేజింగ్ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ 05వ తేదీ నుంచి సేల్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ 09వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ ఉండనున్నాయి. షియోమీ ఫోన్లపై ఏకంగా రూ. 8 వేల డిస్కౌంట్ ప్రకటించారు. ఒకవేళ ఎక్స్చైంజ్ చేసుకోవాలనే వారికి రూ. 2వేల ఆఫర్ ఇచ్చారు. ICICI  బ్యాంకు కస్టమర్లకు (క్రెడిట్, డెబిట్) రూ. వేయి 500 డిస్కౌంట్ ఉంటుందని వెల్లడించారు. 

ఆఫర్ల వివరాలు : – 
షియోమి MI A3 : ఈ ఫోన్‌పై రూ. 2 వేల డిస్కౌంట్ ఉండనుంది. రూ. 12 వేల 999కి విక్రయిస్తోంది. 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. 6GB మోడల్ సెల్ రూ. 16 వేల 999 ధరగా నిర్ణయించారు. 48 MP AI ట్రిపుల్ కెమెరా, 6.08 ఇంచుల సూపర్ డిస్ ప్లే ఉంది. 
షియోమీ రెడ్ మీ 7 : రూ. 2 వేల 500 డిస్కౌంట్ ఉంది. రెడ్ మీ 7 (2GB RAM, 32 GB) రూ. 7 వేల 499గా ఉంది. 4000 వేల mAh బ్యాటరీ ఉంది. 
షియోమీ రెడీ మీ Y 3 : రూ. 3 వేల డిస్కౌంట్ ప్రకటించారు. 3+32 GM RAM మోడల్‌తో ఉన్న రెడ్ మీ Y3 పోన్ రూ. 8 వేల 999కు లభ్యం కానుంది. దీని అసలు ధర రూ. 11 వేల 999.
షియోమీ రెడ్ మీ 6 ప్రో : రూ. 4 వేల 500 డిస్కౌంట్. షియోమీ రెడ్ మీ 6  ప్రో (4GB RAM, 64 GB స్టోరేజీ). రూ. 8 వేల 999 ధరగా నిర్ణయించారు. ధీని అసలు ధర రూ. 13 వేల 499. 5.84 ఇంచుల డిస్ ప్లే కలదు. 
షియోమీ Poco F1 : రూ. 8 వేల డిస్కౌంట్ లభిస్తుంది. షియోమీ Poco F1 ఫోన్ రూ. 18 వేల 999కే (4GB RAM, 64 GB స్టోరేజీ) దొరుకుతుంది. దీనిపై రూ. 8 వేల 999 డిస్కౌంట్ ప్రకటించారు. దీని అసలు ధర రూ. 22 వలే 999. ఒకవే ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 2 వేల డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ వెల్లడించింది. 
షియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో : రూ. 5 వేల డిస్కౌంట్ ప్రకటించారు. రూ. 12 వేల 999 లభ్యం కానుంది. వేయి రూపాయల క్యాష్ బ్యాక్ లభించనుంది.