Microsoft Satya Nadella : మైక్రోసాఫ్ట్ చైర్మన్‏గా తెలుగు తేజం సత్య నాదెళ్ల

భారతీయ-అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, తెలుగుతేజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల సంస్థ నూతన చైర్మన్‌గా నియమితులయ్యారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా సత్యనాదెళ్లను ఎన్నుకుంది. బోర్డ్ ఎలక్షన్‌లో జాన్ థామ్సన్ స్థానంలో కొత్త చైర్మన్‌గా సత్యనాదెళ్లను ఎన్నుకున్నారు.

Microsoft Satya Nadella : మైక్రోసాఫ్ట్ చైర్మన్‏గా తెలుగు తేజం సత్య నాదెళ్ల

Microsoft Satya Nadella

Microsoft Satya Nadella : భారతీయ-అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, తెలుగుతేజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల సంస్థ నూతన చైర్మన్‌గా నియమితులయ్యారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా సత్యనాదెళ్లను ఎన్నుకుంది. బోర్డ్ ఎలక్షన్‌లో జాన్ థామ్సన్ స్థానంలో కొత్త చైర్మన్‌గా సత్యనాదెళ్లను ఎన్నుకున్నారు. స్టీవ్‌ బల్లెమర్‌ నుంచి 2104లో సీఈఓ బాధ్యతలు అందుకున్నారు సత్యనాదెళ్ల.

మైక్రోసాఫ్ట్ వ్యాపార సామాజ్రాన్నివిస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ కావడానికి ముందు.. ఆయన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. కంపెనీ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిర్మించడం వంటి అనేక రోల్స్ విజయవంతంగా నిర్వర్తించారు.

లింక్‌డిన్‌, న్యూయాన్స్‌ కమ్యూనికేషన్స్‌, జెనిమిక్స్‌ వంటి సంస్థల కొనుగోలులో నాదెళ్ల కీలకంగా వ్యవహరించారు. ఫిబ్రవరి 2014 లో స్టీవ్ బాల్‌మెర్ నుంచి బాధ్యతలు స్వీకరించిన నాదెల్లా.. పోటీదారులైన ఆపిల్, గూగుల్ నేతృత్వంలోని కొత్త టెక్ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్‌ను పోటీగా నిలిపారు. నాదెళ్ల మైక్రోసాఫ్ట్ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన సమయంలో టెక్నాలజీ దిగ్గజం డైనోసార్ అవుతుందని కొందరు భయపడ్డారు. 1975లో స్థాపించిన ఈ సంస్థకు మరింత పవర్ అందించిన ఘనత నాదెళ్లకు దక్కుతుంది.. నాదెళ్ల.. ప్రారంభంలో కార్పొరేట్ నిర్మాణాన్ని సరళీకృతం చేశారు.

53ఏళ్ల నాదెల్లా క్లౌడ్ కంప్యూటింగ్‌కు ప్రాధాన్యతనిచ్చారు. మైక్రోసాఫ్ట్ వచ్చే వారమే తన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ న్యూ జనరేషన్ ఆవిష్కరించనుంది. ప్రపంచంలోని డెస్క్‌టాప్ కంప్యూటర్లలో దాదాపు మూడొంతుల కంప్యూటర్లకు పవర్ ఇస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ నుంచి థాంప్సన్‌ లీడ్‌ చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. బోర్డు నుంచి బిల్‌గేట్స్‌ తప్పుకున్న ఏడాది తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

1976 నుంచి బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మైక్రోసాఫ్ట్ మూడో సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టాడు. ప్రపంచ దిగ్గజ సంస్థలో ఇలాంటి గొప్ప అవకాశం భారతీయుడుకి.. అందులోనూ మన తెలుగువాడికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కడం గర్వించదగిన విషయం. మైక్రోసాఫ్ట్.. సీఈఓ ఎంపిక కోసం ఐదు నెలల పాటు కసరత్తు చేసి మరి సత్యను ఎంపిక చేసింది.

సత్య నాదెళ్లది.. అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్.. 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. నాదెళ్ల యుగంధర్ ఐఏఎస్‌ అయిన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో బీఎన్ యుగంధర్ దంపతులకు హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు. సత్య ప్రాథమిక విద్య మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది.

అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. సాఫ్ట్‌వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. కొంతకాలం సన్ మైక్రో సిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లోకి అడుగుపెట్టారు. రెండో సీఈవో స్టీవ్ బామర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.