Windows Update: విండోస్ యూజర్లకు అర్జెంట్ సెక్యూరిటీ వార్నింగ్

మైక్రోసాఫ్ట్ విండోస్‌ వినియోగదారులకు కీలక సూచనలిచ్చింది. కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని దిగ్గజ టెక్‌ సంస్థ వెల్లడించింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో భారీ స్థాయిలో లోపం బయటపడిందని వచ్చిందని అందుకే వెంటనే అప్ డేట్ చేసుకోవాలని పిలుపునిచ్చింది.

Windows Update: విండోస్ యూజర్లకు అర్జెంట్ సెక్యూరిటీ వార్నింగ్

Windows Update

Windows Update: మైక్రోసాఫ్ట్ విండోస్‌ వినియోగదారులకు కీలక సూచనలిచ్చింది. కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని దిగ్గజ టెక్‌ సంస్థ వెల్లడించింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో భారీ స్థాయిలో లోపం బయటపడిందని వచ్చిందని అందుకే వెంటనే అప్ డేట్ చేసుకోవాలని పిలుపునిచ్చింది.

ఒకవేళ అలా చేసుకోకపోతే హ్యాకర్లు డేటా చోరీకి పాల్పడేందుకు అవకాశమిచ్చినట్లవుతుందని హెచ్చరించింది. ఈ లోపాలన్ని నివారించడానికి ఓ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఒకే ప్రింటర్‌ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్‌లో ‘ప్రింట్‌ స్పూలర్‌’ ఉపయోగపడుతుంది.

ఇందులో సేఫ్టీ డిఫెక్ట్స్ బయటిపడినట్లు గుర్తించామని సాంగ్‌ఫర్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ రీసెర్చర్స్ ఈ ఏడాది మేలో తెలిపారు. ఈ విషయంలో వారే ఓ పొరబాటు చేశారు. ఎలా హ్యాక్‌ చేయొచ్చనే వివరాలను కూడా ఆన్‌లైన్‌లో ప్రచురించేశారు. వెంటనే డిలీట్‌ చేసినప్పటికీ.. ఆ లోపే కొన్ని డెవలపర్‌ సైట్లలోకి సదరు సమాచారం చేరింది.

‘ప్రింట్‌నైట్‌మేర్‌’గా పిలుస్తున్న ఈ లోపంతో డేటా చోరీ అయ్యే ప్రమాదముందని జాగ్రత్తపడాలని యూజర్లకు సూచిస్తున్నారు. డేటాను చూడటం, డిలీట్‌ చేయడం, కొత్త యూజర్‌ అకౌంట్లను సృష్టించడం వంటి చర్యలకూ పాల్పడే అవకాశముందని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. విండోస్‌-10తో పాటు విండోస్‌-7లోనూ ఈ లోపం ఉందని తెలిపింది.

వాస్తవానికి విండోస్‌-7ను గతేడాదే తమ సపోర్ట్‌ను ముగించిన మైక్రోసాఫ్ట్‌ ప్రింట్‌నైట్‌మేర్‌ తీవ్రత దృష్ట్యా మళ్లీ అప్‌డేట్‌ను అందించింది.