KTR : నేను డ్రగ్స్ అనాలసిస్ టెస్టులకు సిద్ధం..రాహుల్ గాంధీ సిద్ధమా?

డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకూ, డ్రగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై కొందరు చిల్లరగాళ్లు ఈడీకి ఫిర్యాదు చేశారన్నారు.

KTR : నేను డ్రగ్స్ అనాలసిస్ టెస్టులకు సిద్ధం..రాహుల్ గాంధీ సిద్ధమా?

Ktr (1)

KTR key comments : డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకూ, డ్రగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై కొందరు చిల్లరగాళ్లు ఈడీకి ఫిర్యాదు చేశారన్నారు. అతన్ని పీసీసీ చీఫ్ అంటారా? చీప్ అంటారా? తెలుసుకోవాలి. కావాలంటే తాను శాంపిల్స్ అన్నీ ఇస్తానని.. రాహుల్ గాంధీ కూడా వచ్చి ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇలాగే వ్యవహరిస్తే రాజద్రోహం కేసులు పెట్టాల్సి వస్తుందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ అనుసరించిన విధానాన్నే స్పూర్తిగా తీసుకుంటామని హెచ్చరించారు.

ఢిల్లీ పార్టీలకు సిల్లీ పాలిటిక్స్ మాత్రమే తెలుసని కేటీఆర్ విమర్శించారు. తాము చేసిన అభివృద్ధి చూసేందుకు ఒకరు పాదయాత్ర చేస్తున్నారని.. మరొకరు తాను ఉన్నా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హుజురాబాద్‌ ఒక్క స్థానంతో కేంద్రంలో, రాష్ట్రంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఉప ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌దే విజయమన్నారు.

KTR To Bandi : రాజీనామాకు సిద్ధమా? బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్..

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్ని సభలు అయినా పెట్టుకొవచ్చన్న కేటీఆర్.. ఆ సభలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మారాయని విమర్శించారు. పీసీసీ పదవులు అమ్ముకుంటారని సొంత పార్టీ వాళ్లు చెబుతున్నారన్నారు. తెలంగాణకు వస్తున్న జాతీయ నేతలు.. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

అటు కొత్త పార్టీలపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రవీణ్ కుమార్, షర్మిల పార్టీలు కేంద్రం గురించి ఒక్క మాట కూడా మాట్లాడవన్నారు. ప్రవీణ్‌ కుమార్ పదవిలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడలేదా? అని ప్రశ్నించారు.