అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా : ‘Paytm First’ వచ్చేసింది

అంతా డిజిటల్ మయం. క్షణాల్లో ఆన్ లైన్ ట్రాన్స్ జెక్షన్స్ జరిగిపోతున్నాయి. బ్యాంకులు, ఎటీఎంల చుట్టూ తిరిగాల్సిన పనిలేదు. సమయం ఎంతో ఆధా అవుతుంది. ఉన్నచోటే డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : March 6, 2019 / 08:13 AM IST
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా : ‘Paytm First’ వచ్చేసింది

అంతా డిజిటల్ మయం. క్షణాల్లో ఆన్ లైన్ ట్రాన్స్ జెక్షన్స్ జరిగిపోతున్నాయి. బ్యాంకులు, ఎటీఎంల చుట్టూ తిరిగాల్సిన పనిలేదు. సమయం ఎంతో ఆధా అవుతుంది. ఉన్నచోటే డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు.

అంతా డిజిటల్ మయం. క్షణాల్లో ఆన్ లైన్ పేమెంట్స్ జరిగిపోతున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరిగాల్సిన పనిలేదు. సమయం ఎంతో ఆదా అవుతుంది. ఉన్నచోటే డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. పేటీఎం, పేజాప్, గూగుల్ పే (తేజ్) ఇలా మరెన్నో మొబైల్ వ్యాలెట్లు పేమెంట్ సర్వీసులను అందిస్తున్నాయి. ఈ కామర్స్ వెబ్ సైట్లు, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు కూడా తమ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లు అందిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు ఫుడ్, ట్రావెల్, ఎంటర్ టైన్ మెంట్ వంటి సర్వీసులపై యూజర్లకు బెనిఫెట్స్ అందిస్తున్నాయి.
Also Read : సరిదిద్దుకోండి : క్రెడిట్ కార్డుపై చేసే 6 తప్పులు ఇవే

మొబైల్ వ్యాలెట్ కంపెనీ పేటీఎం కూడా ప్రీమియం సర్వీసులను యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. అదే.. పేటీఎం ఫస్ట్. ఈ ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ ప్రొగ్రామ్.. రివార్డ్స్, లయాలటీ పాయింట్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో వీడియోలు, మ్యూజిక్ స్ట్రీమింగ్, ఫుడ్, ట్రావెల్, షాపింగ్, లైఫ్ స్టయిల్ వంటి ఎన్నో సర్వీసులను పొందొచ్చు. ‘‘పేటీఎం ఫస్ట్ ప్రొగ్రామ్ ను లాంచ్ చేశాం. ఇదొక ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ ప్రొగ్రామ్. యూజర్లకు రెగ్యులర్ ఆఫర్లతో పాటు ఎక్స్ క్లూజీవ్ బెనిఫెట్స్ అందిస్తున్నాం’’ అని ఒక ప్రకటనలో పేటీఎం తెలిపింది. 

ఫేటీఎం ఫస్ట్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్ లో అందుబాటులో ఉంది. మార్చి 5న పేటీఎం సంస్థ తొలిసారి ఈ ప్రొగ్రామ్ ను తమ యూజర్ల కోసం లాంచ్ చేసింది. ఐఫోన్, ఐఓఎస్ యూజర్లకు మార్చి 6 నుంచి పేటీఎం ఫస్ట్ యాప్ అందుబాటులోకి రానుంది. 
Also Read : విదేశాలకు వెళ్తున్నారా : ఎయిర్‌టెల్‌ Foreign Pass రీఛార్జ్ ఆఫర్

పేటీఎం ఫస్ట్ సబ్ స్ర్కిప్షన్ ఛార్జ్ : 
* ఈ సర్వీసు పొందాలంటే.. ఏడాదికి రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. 
* మొదటి 15వందల కస్టమర్లకు రూ.100 ఆరంభ క్యాష్ బ్యాక్ 
* రెండో సంవత్సరం నుంచి ఏడాదికి రూ.650 చెల్లించాలి
* క్యాష్ బ్యాక్ ఆఫర్.. లిమిటెడ్ పిరియడ్ మాత్రమే 

పేటీఎం ఫస్ట్ ప్రొగ్రామ్ బెనిఫెట్స్ ఇవే..
* పేటీఎం ఫస్ట్ ప్రొగ్రామ్ కింద పేటీఎం రూ.1200 వరకు బెనిఫెట్స్ ఆఫర్లు అందిస్తోంది.
* జొమాటో గోల్డ్ మెంబర్ షిప్, యానివల్ గానా మెంబర్ షిప్, యానివల్ సోని లైవ్ సబ్ స్ర్కిప్షన్, ViU ప్రీమియం, ఎరోస్ నౌ యానివల్ మెంబర్ షిప్, ఉబర్ బెనిఫెట్స్ రూ.6వేలకు వరకు పొందొచ్చు. 
* ఉబర్ ఈట్స్ బెనిఫెట్స్ రూ.24 వందలకు పైనే యూజర్లు పొందే అవకాశం ఉంది. 
* అదనంగా రూ.15వందలు క్యాష్ బ్యాక్
* ప్రతి నెలా మూవీ టికెట్లపై రూ.100 క్యాష్ బ్యాక్ 
* పేటీఎం మాల్ నుంచి షాపింగ్ చేస్తే ఎక్స్ క్లూజీవ్ ఆఫర్లు 
* అన్ లిమిటెడ్ ఫ్రీ, ప్రీయార్టీ షిప్పింగ్, 24/7 కస్టమర్ కేర్ యాక్సస్
Also Read : పేరంట్స్ Ok అనాలంట : PUBG గేమ్‌కు ఏజ్ లిమిట్