Royal Enfield Thunderbird : వారియర్ స్ట్రీట్ ఫైటర్‌.. రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్.. కొత్త లుక్ అదిరిందిగా..!

రాయల్ ఎన్ ఫీల్డ్ మోడల్ Thunderbird Cruiser మోటార్ సైకిల్ Modify చేస్తే ఎలా ఉంటుందో చూశారా? అయితే ఇప్పుడు చూడండి.. కొత్త డిఫరెంట్ లుక్‌తో కుర్రకారును ఫిదా చేస్తోంది..

Royal Enfield Thunderbird : వారియర్ స్ట్రీట్ ఫైటర్‌.. రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్.. కొత్త లుక్ అదిరిందిగా..!

Modified Royal Enfield Thunderbird From Neev Motorcycles Wants To Be A Street Fighter (1)

Modified Royal Enfield Thunderbird : భారత్ సహా ప్రపంచ మార్కెట్లో మోస్ట్ పాపులర్ మోటార్ సైకిల్ బ్రాండ్లలో క్రేజ్ ఉన్న బైక్ అంటే.. టక్కున గుర్తుచ్చేది.. రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్స్ (Royal Enfield Motorcycles). ఈ బ్రాండ్ నుంచి ఎన్నో వెరైటీ మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఆ లైనప్‌లో అత్యంత పాపులర్ అయిన మోడల్స్ రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ (Royal Enfield Bullet), క్లాసిక్ 350 మోటార్ సైకిల్స్ (Classic 350 motorcycles) ముందు వరుసలో ఉన్నాయి.

Modified Royal Enfield Thunderbird From Neev Motorcycles Wants To Be A Street Fighter (2)

రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ నుంచి మరో బైక్ కూడా ఉంది.. అదే.. Thunderbird cruiser motorcycle. కానీ, ప్రస్తుతం ఈ బైక్ మార్కెట్లో అందుబాటులో లేదు. ఈ మోడల్ స్థానంలో రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్తగా Meteor 350 motorcycle మార్కెట్లోకి వచ్చింది.

రాయల్ ఎన్ ఫీల్డ్ బ్రాండ్ మోడల్స్ కూడా ఎన్నో రకాలుగా మాడిఫికేషన్స్ చేసుకునేలా ఉంటాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ నిలిపివేసిన ఈ మోడల్ Thunderbird cruiser మోటార్ సైకిల్ మాడిఫై చేస్తే ఎలా ఉంటుందో చూశారా? అయితే ఇప్పుడు చూడండి.. మాడిఫై చేసిన తర్వాత దీని లుక్ చాలా డిఫరెంట్ గా చాలా ఎట్రాక్టివ్ గా మారిపోయింది. ఒక Street Fighter మాదిరిగా లుక్ ఛేంజ్ అయింది. Neev Motorcycles ఈ మోటార్ సైకిల్ ను మాడిఫై చేసింది. Yoddha మాదిరిగా క్రియేట్ చేసింది. అంటే.. ఒక వారియర్ (Warrior) తరహాలో డిఫరెంట్ లుక్‌తో ఆకట్టుకుంటోంది.

Modified Royal Enfield Thunderbird From Neev Motorcycles Wants To Be A Street Fighter (3)

నీవ్ మోటార్ సైకిల్స్ (Neev Motorcycles) వ్యవస్థాపకుడు, లీడ్ డిజైనర్ అయిన Navneet Suri ఈ మోటార్ సైకిల్ ను ఇలా సరికొత్తగా డిజైన్ చేశారు. Yoddha అనేది.. Royal Enfield Thunderbird 350 మోటార్ సైకిల్ ఆధారంగా డిజైన్ చేశారు. పూర్తిగా మోడిఫై చేసి సరికొత్త లుక్ తీసుకొచ్చారు. చూస్తుంటే.. Thunderbird మోటార్ సైకిల్ మాదిరిగా లేదు.. దీనిలోని అన్నింటిని మార్చేశారు.. మొత్తం కస్టమ్ మేడ్ యూనిట్లతో రీప్లేస్ చేసేశారు. ఇక సైడ్ ప్యానెల్స్ కూడా షీల్డ్ మాదిరిగా డిజైన్ చేశారు.

ఫ్రంట్ సైట్ చూస్తే.. ఒరిజినల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ పై USD forks తో రీప్లేస్ చేశారు. అలాగే Stock Steel rims స్థానంలో గ్లాస్ బ్లాక్ అలోయ్ చక్రాలతో (gloss black alloy wheels) పూర్తిగా మోడిఫై చేశారు. ఒరిజినల్ హెడ్ లైట్ కూడా తొలగించారు. మార్కెట్లోకి వచ్చిన రౌండ్ డ్యుయల్ హెడ్ ల్యాంప్స్ అమర్చారు. హ్యాండిల్ బార్ కూడా మార్చేశారు. బార్ చివరి భాగంలో LED లైట్స్ అమర్చారు.

Modified Royal Enfield Thunderbird From Neev Motorcycles Wants To Be A Street Fighter (4)

ఫ్యూయిల్ ట్యాంకు కూడా కస్టమ్ మేడ్ యూనిట్ తోనే అమర్చారు. ట్యాంకుపై టీయర్ డ్రాప్ డిజైన్ స్థానంలో షార్పర్ లుకింగ్ లోకి మార్చేశారు. ఇక బైక్ ఇంజిన్ పూర్తిగా బ్లాక్ గా మార్చేశారు. ఫ్రంట్ సైడ్‌లో ఇంజిన్ ను ప్రొటెక్ట్ చేసేలా మెటల్ సీట్ ఒకటి అమర్చారు. Royal Enfield Thunderbird బైక్.. రెండు సీట్లతో వచ్చిన క్రూయిజర్ మోటార్ సైకిల్.. Yoddha మోటార్ సైకిల్ గా మారిన తర్వాత ఒకే సింగిల్ సీటర్ కు మార్చేశారు.

Modified Royal Enfield Thunderbird From Neev Motorcycles Wants To Be A Street Fighter (6)

ఇక ఇంజిన్ పొగ వెలువడే exhaust system కూడా స్టీల్‌తో అమర్చారు. ఇది ఫ్రీ ఫ్లోయింగ్ M4 muffler exhaust note గా చెప్పవచ్చు. ఇక టైర్ల విషయానికి వస్తే.. Rear Tyre కస్టమ్ మేడ్ అని చెప్పవచ్చు. ఫ్రంట్ సైడ్ అతిపెద్ద డిస్క్ బ్రేక్, అలాగే గ్రే, బ్లాక్ డ్యుయల్ టోన్ పెయింట్ అన్నింటిని మాడిఫై చేసేశారు. మొత్తంగా చూస్తే.. ఒక వారియర్ (Warrior) మాదిరిగా లుక్ కనిపిస్తోంది. ఇంజిన్ ఏమైనా మార్చేశారా లేదా అనేది క్లారిటీ లేదు. ఢిల్లీలో కస్టమ్ మేడ్ బైక్, మాడిఫికేషన్ చేయడంలో Neev Motorcycles చాలా పాపులర్ కంపెనీ. ఎవరైనా తమ బైకును మాడిఫై చేయాలనుకుంటే.. Neev Motorcycles సంప్రదించవచ్చు.