Mother’s Day 2022 : మదర్స్ డే స్పెషల్.. రూ.10వేల లోపు 5 బెస్ట్ టెక్ గిఫ్ట్స్ ఇవే..!
Mother’s Day 2022 : మే (8) ఆదివారం మాతృ దినోత్సవం (Mother’s Day). ఈ సందర్భంగా అమ్మ ప్రేమకు గుర్తుగా ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని భావిస్తుంటారు.

Mother’s Day 2022 : మే (8) ఆదివారం మాతృ దినోత్సవం (Mother’s Day). ఈ సందర్భంగా అమ్మ ప్రేమకు గుర్తుగా ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని భావిస్తుంటారు. కొన్ని ప్రత్యేక బహుమతుల కోసం తెగ వెతికేస్తుంటారు. మీ తల్లికి ప్రత్యేకమైన అనుభూతి కలిగించేందుకు ఎలాంటి బహుమతిగా ఇస్తే బాగుంటుందో అర్థం కావాడం లేదా? అయితే మీకోసం ఈ మదర్స్ డే సందర్భంగా కొన్ని టెక్ గిఫ్ట్స్ అందిస్తున్నాం. కేవలం రూ. 10,000లోపు 5 టెక్ గ్యాడ్జెట్లను ఎంచుకోవచ్చు. ఇందులో ఏదైనా ఒకటి అమ్మకు బహుమతిగా ఇచ్చివారిని సంతోష పెట్టవచ్చు.. ఇంతకీ ఆ టెక్ గిఫ్ట్స్ ఏంటో ఓసారి చూద్దాం..
Smartphone :
ప్రస్తుత రోజుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. ఇంట్లో అవసరాలు తీర్చే అమ్మకు కూడా ఫోన్ అవసరం ఉంటుంది. మదర్స్ డే సందర్భంగా మీ తల్లికి కొత్త ఫోన్ బహుమతిగా ఇవ్వొచ్చు. అదే మదర్స్ డే రోజున మీరుచ్చే గొప్ప గిఫ్ట్ అని చెప్పవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ రూ. 10వేల లోపు అయితే.. Realme Narzo 30A స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. లేదంటే.. రూ. 13,000 వరకు బడ్జెట్ పెడితే.. మీరు Redmi Note 10S స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. అమెజాన్‌లో రూ. 13,999కే అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉన్న రూ. 1,500 డిస్కౌంట్ కూపన్ కూడా అందిస్తోంది. డిస్కౌంట్ ధరతో రూ.12,499కే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 2021లో లాంచ్ అయిన ఈ ఫోన్ 5G స్మార్ట్‌ఫోన్ కాదని గుర్తించాలి.
Wireless earphones :
అమ్మకు ఇచ్చే మరో బెస్ట్ గిఫ్ట్ ఇదొకటి.. ఇంట్లో చాలామందికి మ్యూజిక్ అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చాలామంది ఇయర్ ఫోన్లలో పాటలు వింటూ ఇంట్లో పనులను చక్కబెడుతుంటారు. అంతేకాదు.. ఫోన్ కాల్స్ కూడా పిక్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఇయర్ బడ్స్, వైర్డ్ ఇయర్‌ఫోన్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్ తీసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా పని చేస్తూ కూడా ఫోన్ కాల్స్ పిక్ చేసుకోవచ్చు. మ్యూజిక్ వినడం ఇష్టమైతే.. Soundcore Air 2 Proని కొనుగోలు చేయవచ్చు. బెస్ట్ TWS వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లలో ఇది ఒకటి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)కి సపోర్టు ఇస్తుంది. నాయిస్‌ని ఫిల్టర్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ధరకు చాలా బాగుంది. మీ అమ్మకు ఇలాంటిది టెక్ గిఫ్ట్ ఇస్తే చాలా సంతోషపడతారు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 7,999గా ఉంది. మీ బడ్జెట్ దాదాపు రూ. 2,000 అయితే.. మీరు OnePlus Bullets Wireless Z2ని కొనుగోలు చేయవచ్చు. నెక్‌బ్యాండ్-శైలి డిజైన్‌ను కలిగి ఉంది. TWS కాదని గుర్తించాలి.

Mother’s Day 2022 5 Best Tech Gift Ideas Under Rs 10,000
Smart lamp :
మీ మదర్‌కు రాత్రిపూట పుస్తకాలు చదవడం ఇష్టమా.. మీరు ఆమెకు బెస్ట్ స్మార్ట్ ల్యాంప్ కొనవచ్చు. స్మార్ట్ ల్యాంప్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అమెజాన్‌లో రూ. 2,799 ధరతో Xiaomi Mi స్మార్ట్ బెడ్‌సైడ్ ల్యాంప్ 2 అందుబాటులో ఉంది. ఈ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ ల్యాంప్ 11ఏళ్ల లైఫ్ టైం కలిగి ఉంది. ఈ ల్యాంప్ కలర్ బ్రైట్‌నెస్‌గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఫ్లో మోడ్ కూడా ఉంది. ల్యాంప్ ఆటోమాటిక్ కలర్ చేంజ్ అవుతుంటుంది. ఈ డివైజ్ టచ్-ప్యానెల్‌ను కూడా కలిగి ఉంది. వాల్యూమ్‌ను కంట్రోల్ చేసుకునే వీలుంది. ఇది అలెక్సా గూగుల్ అసిస్టెంట్‌లకు సపోర్టు ఇస్తుంది. Mi స్మార్ట్ బెడ్‌సైడ్ లాంప్ 2ని కంపెనీ Mi Home యాప్‌ని ఉపయోగించి కంట్రోల్ చేయవచ్చు.
Smart Speaker :
ఇంట్లో మీ అమ్మకు పాటలు వినడం ఇష్టమైతే.. మీరు స్మార్ట్ స్పీకర్ ఒకటి గిఫ్ట్ కొని ఇవ్వొచ్చు. మదర్స్ డే రోజు స్మార్ట్ స్పీకర్ గిఫ్ట్ గా ఇవ్వడం ఒక బెస్ట్ ఆప్షన్. స్మార్ట్ స్పీకర్ కేవలం పాటలను ప్లే చేయడమే కాదు.. చాలా పనులు చేసుకోవచ్చు. మీరు Amazon Eco Show 5ని కొనుగోలు చేస్తే.. మీ అమ్మకు ఈ స్పీకర్‌లో వీడియోలు లేదా టీవీ షోలను చూడవచ్చు. స్మార్ట్ బల్బ్, స్మార్ట్ టీవీలు, సెక్యూరిటీ కెమెరాలు వంటి home appliances తీసుకోవచ్చు. కేవలం వారి వాయిస్ ద్వారా ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లను కంట్రోల్ చేయొచ్చు. దీని ధర రూ. 4,499గా ఉండగా.. చిన్న 5.5-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. మీకు పెద్ద స్క్రీన్ కావాలంటే.. Amazon Echo Show 8ని ట్రై చేయొచ్చు. సైట్‌లో రూ. 9,999కి అందుబాటులో ఉంది. ఈ డివైజ్ మీ ఇంటిని రిమోట్‌గా మార్చేస్తుంది. వీడియో కాల్స్ చేయడానికి ఇందులో కెమెరాను కూడా ఉపయోగించవచ్చు.
Smartwatch :
మీరు మదర్స్ డే రోజున అమ్మకోసం.. స్మార్ట్ వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్‌ని కూడా కొనుగోలు చేయవచ్చు. Mi band 6, Amazfit Bip U Pro, Amazfit Bip S Lite, Realme Watch 2 Pro ఏమైనా ఒకటి తీసుకోవచ్చు. వీటిని ధరించడం ద్వారా రోజువారీ పనులు, నిద్ర విధానాలు, హృదయ స్పందన రేటు, SpO2 వంటి ట్రాక్ చేయడంలో సాయపడతాయి. ఈ వేరబుల్ డివైజ్‌లు కేవలం మీ ఆరోగ్యంపై అవగాహన కోసమే పనిచేస్తాయి. వైద్యపరమైన ఉపయోగం కోసం కాదని గుర్తించుకోవాలి.
Read Also : Apple Smart Bottles : ఆపిల్ సరికొత్త స్మార్ట్ వాటర్ బాటిల్స్.. ఇక డివైజ్‌లతో కనెక్టింగ్ ఈజీ.. ధర ఎంతంటే?
1MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత
2Kanika Kapoor Marriage: పుష్ప సింగర్ రెండో పెళ్లిలో ఉపాసన సందడి!
3CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
4Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
5Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన
6Jeremy Renner: ఢిల్లీలో ‘అవెంజర్స్’ హీరో.. బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం వచ్చాడట!
7Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
8Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
9Dandruff : వేధించే చుండ్రు సమస్య!
10NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
-
Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
-
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?