Moto Edge 30 : మోటరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది.. మే 12నే లాంచ్.. ఫీచర్లు ఇవేనా?

Moto Edge 30 launch : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటరోలా త్వరలో భారత మార్కెట్లో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది.

Moto Edge 30 : మోటరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది.. మే 12నే లాంచ్.. ఫీచర్లు ఇవేనా?

Moto Edge 30 Launch In India On May 12 Expected Price, Specifications (1)

Moto Edge 30 launch : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటరోలా త్వరలో భారత మార్కెట్లో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. మోటో ఎడ్జ్ 30 (Moto Edge 30) స్మార్ట్ ఫోన్ మే 12న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. ఈ ఏడాది ప్రారంభంలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 SoCతో వచ్చిన Edge 30Pro ఫోన్ కిందిభాగంలో వెనిలా ఎడ్జ్ 30 కలిగి ఉంది. అధికారిక లాంచ్‌కు ముందు Motorola Moto Edge 30 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధర వంటి వివరాలను మీకోసం అందిస్తున్నాం..

Moto Edge 30 లాంచ్ తేదీ :
మే 12న మోటో ఎడ్జ్ 30 ఇండియా లాంచ్ ఈవెంట్ జరుగుతుందని Motorola ధృవీకరించింది. లాంచ్ తర్వాత Flipkart, Reliance Digital సహా భారత ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Moto Edge 30 స్పెసిఫికేషన్స్ (అంచనా) :
Moto Edge 30 ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్‌గా గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.79 మిమీ మాత్రమేగా మందగా ఉంటుంది. దీని హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 778G+ SoCతో వస్తుంది. 6nm చిప్ గరిష్టంగా 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఫ్రంట్ సైడ్‌లో Full HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల pOLED డిస్‌ప్లే ఉంది. 10-బిట్ కలర్ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరాపైనా చిన్న హోల్-పంచ్ కటౌట్‌ కలిగి ఉంది.

Moto Edge 30 Launch In India On May 12 Expected Price, Specifications

Moto Edge 30 Launch In India On May 12 Expected Price, Specifications

ఈ డివైజ్ వెనుకవైపు ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా సెన్సార్ 50MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌లో 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. Edge 30 చిన్న 4020 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో పొడవైన 6.5-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. రోజంతా బ్యాటరీ ఛార్జింగ్ అందిస్తుందో లేదో ఖచ్చితంగా తెలియదు. ఈ డివైజ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. భారత యూజర్లు ఈ ఫోన్ కొనుగోలు చేస్తే.. బాక్స్‌లో అడాప్టర్‌ కూడా పొందే అవకాశం ఉంది. Moto Edge 30 ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది. 3ఏళ్లుగా సెక్యూరిటీ సపోర్టుతో పాటు రెండు మెయిన్ Android అప్ డేట్ తో రానుంది. ఈ ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ 5.2 వై-ఫై 6E ఉన్నాయి.

Moto Edge 30 ధర (అంచనా) :
Motorola మే 12న జరిగే ఈవెంట్‌లో Moto Edge 30 స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ప్రకటిస్తుంది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 30,000 నుంచి రూ. 35,000 మధ్య ధరతో లాంచ్ అవుతుందని అంచనా. ఈ ఫోన్ యూరప్ మార్కెట్‌లలో EUR 449.99 (దాదాపు రూ. 36,000)కి లాంచ్ అయింది.

Read Also : Nokia G21 smartphone: భారత్ లో జీ21 స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన నోకియా, మరో రెండు చిన్న ఫోన్లు కూడా