Moto G82 5G : మోటో G82 5G ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది.. ఈ ఫోన్లో ఇదే స్పెషల్..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటరోలా నుంచి ఇటీవలే కొత్త మోటో G82 5G ఫోన్ లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది.

Moto G82 5G : మోటో G82 5G ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది.. ఈ ఫోన్లో ఇదే స్పెషల్..!

Moto G82 First Sale In India Today Should You Buy It

Moto G82 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటరోలా నుంచి ఇటీవలే కొత్త మోటో G82 5G ఫోన్ లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. మోటరోలా కంపెనీ నెల వ్యవధిలోనే నాలుగు కన్నా ఎక్కువ ఫోన్‌లను ఆవిష్కరించింది. Motorola ఇటీవల బడ్జెట్ సిగ్మంట్‌లో Moto G82ని రిలీజ్ చేసింది. Moto G82 5G ఫోన్ ఈరోజు నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన పోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 SoC సెగ్మెంట్‌లో భారత్ మొదటి OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాతో సహా చాలా ఫీచర్లతో వస్తుంది.

Motorola Moto G82 : ఇండియాలో ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో Moto G82 ఫోన్.. 6GB+128GB వేరియంట్ రూ.21,499కి రిలీజ్ అయింది. Moto G82 ఫోన్ 8GB+128GB వేరియంట్ ధర రూ.22,999గా నిర్ణయించింది. SBI బ్యాంక్ డిస్కౌంట్‌లతో 6GB వేరియంట్‌ ధర రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. 8GB వేరియంట్‌కు రూ. 21,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్, ఇతర స్టోర్‌లలో కొనుగోలు చేయొచ్చు. Moto G82 మెటోరైట్ గ్రే వైట్ లిల్లీతో సహా పలు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Moto G82 First Sale In India Today Should You Buy It (1)

Moto G82 First Sale In India Today Should You Buy It 

Moto G82 : స్పెసిఫికేషన్‌లు :
Moto G82 ఫోన్ 6.6-అంగుళాల Full HD+ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా పంచోల్ కటౌట్ ఉంది. Moto G82 వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా సెన్సార్ ఉంటుంది. కెమెరాతో ఫోటోలు, వీడియోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్టు ఇస్తుంది. ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. Moto G82 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoCతో రన్ అవుతుంది.

స్టోరేజీల విషయానికి వస్తే.. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగి ఉంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో 30W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. Moto G82 మిడ్-రేంజ్ విభాగంలో బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. స్టోరేజీ కన్నా కెమెరాల పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇందులో కెమెరాలే స్పెషల్ ఎట్రాక్షన్ కూడా. Moto G82 5G డిస్‌ప్లే స్పీకర్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాటరీ లైఫ్‌ పర్ఫార్మెన్స్ బాగుంది. సాఫ్ట్‌వేర్ కూడా చాలా బాగుంది. Motorolaకు మూడు సంవత్సరాల సెక్యూరిటీ సపోర్టు అందించనుంది. Android 13 అప్‌డేట్‌ కూడా అందించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also : Nothing Phone (1) : జూలై 12న నథింగ్ ఫోన్ (1) వస్తోంది.. తమిళనాడులోనే తయారీ..!