గెలాక్సీకి పోటీగా : మడతబెట్టే మోటరోలా RAZR వచ్చేస్తోంది

స్మార్ట్ ప్రపంచం.. అంతా స్మార్ట్ ఫోన్ల ట్రెండ్. ప్రతి మొబైల్ కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

  • Published By: sreehari ,Published On : March 2, 2019 / 07:20 AM IST
గెలాక్సీకి పోటీగా : మడతబెట్టే మోటరోలా RAZR వచ్చేస్తోంది

స్మార్ట్ ప్రపంచం.. అంతా స్మార్ట్ ఫోన్ల ట్రెండ్. ప్రతి మొబైల్ కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

స్మార్ట్ ప్రపంచం.. అంతా స్మార్ట్ ఫోన్ల ట్రెండ్. ప్రతి మొబైల్ కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా అన్నీ మొబైల్ తయారీ సంస్థలు తమ కొత్త ప్రొడక్టులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు అత్యాధునిక ఫీచర్లతో కట్టిపడేస్తున్నాయి. ఇప్పటికే శాంసంగ్, జియోమీ, ఎల్ జీ, హెచ్ఎండీ గ్లోబల్ నోకియా తమ సరికొత్త స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టాయి. 5జీ నెట్ వర్క్, ఫోల్డడబుల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశాయి.  ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం మెటరోలా కూడా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. 

మోటో ‘రాజర్’ (RAZR) మడతబెట్టే స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టనుంది. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ కు సంబంధించి బ్లూ ఫ్రింట్ ఒరిజినల్ మోడ్ గురించి ఎన్నో లీక్ లు ఆన్ లైన్ లో చక్కెర్లు కొడుతున్నాయి. అంతేకాదు.. బర్సిలోనాలో జరుగుతున్న ఎండబ్ల్యూసీ ఈవెంట్ లో మోటరోలా రాజర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తారని రూమర్లు వినిపించాయి. మోటరోలా ఇంకా ఫోల్డబుల్ డివైజ్ డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉందని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

త్వరలో మోటరోలా ఫోల్డబుల్ ఫోన్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. OLED డివైజ్ ప్లాస్టిక్ ఫిల్మ్ టాప్ స్మార్ట్ ఫోన్  టెస్టింగ్ దశలో ఉన్నట్టు తెలిపారు. ఈ ఫోల్డబుల్ మోటరోలా స్మార్ట్ ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ ఫొల్డ్, హువావే మేట్ ఎక్స్ గో ఫోన్ కంటే డిఫరెంట్ గా డిజైన్ తో రానుంది. ఈ ఏడాది ఆఖరులో మోటో RAZR ఫోల్డబుల్ ఫోన్ ను లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర దాదాపు లక్ష వరకు ఉంటుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అల్ట్రా థిన్‌ స్టయిలిష్‌ డిజైన్‌తో ‘మోటరోలా రాజర్‌ వి3’ ను 2004లో తొలిసారి మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వస్తోన్న మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కావడంతో ఫీచర్లు ఎలా ఉంటాయనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ మోటరోలా రాజర్ స్మార్ట్ ఫోన్ ధర ఎంత ఉంటుందో మోటరోలా మొబైల్ మేకర్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మోటరోలా రాజర్ మార్కెట్లోకి వచ్చాక ఇతర స్మార్ట్ ఫోన్ల దిగ్గజాలతో పోటీగా ఎంత మేరకు యూజర్లను ఆకట్టుకుందో చూడాలి.