Moto X40 Launch Date : భారత్‌కు మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 15న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto X40 Launch Date : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా (Motorola) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 15న లాంచ్ చేసేందకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్లో Motorola మరెన్నో ప్రొడక్టులను ప్రకటించనుంది.

Moto X40 Launch Date : భారత్‌కు మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 15న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto X40 likely to launch at Motorola’s December 15 event

Moto X40 Launch Date : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా (Motorola) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 15న లాంచ్ చేసేందకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్లో Motorola మరెన్నో ప్రొడక్టులను ప్రకటించనుంది. నివేదికల ప్రకారం.. మోటోరోలా రెండు ఫోన్ లాంచ్‌లను చేసే అవకాశం ఉందని వెల్లడించాయి. అందులో ఒకటి Moto X40 స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు, కంపెనీ Moto X40 గురించి ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు. అయితే ఈ డివైజ్ ఇప్పటికే TENNA, Geekbench వంటి అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.

ఈ లిస్టులో Moto X40 గురించి చాలా వివరాలను వెల్లడించాయి. Qualcomm కొత్త, టాప్-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో వస్తుందని చెప్పవచ్చు. 2023లో అనేక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లతో రావచ్చునని నివేదిక తెలిపాయి. ఈ డివైజ్ గరిష్టంగా 18GB RAM, 512GB స్టోరేజీ ఆప్షన్‌తో ప్రారంభించవచ్చు. Moto X40 యూజర్లకు కంటెంట్ వినియోగం కోసం బిగ్ స్క్రీన్‌ను అందించేందుకు సాధారణ 6.67-అంగుళాల డిస్‌ప్లేతో పాటు కర్వడ్ ప్యానెల్ ఉండవచ్చు. అలాగే, ప్యానెల్ Full HD+ రిజల్యూషన్‌తో రానుంది. జీరో బెజెల్‌లకు దగ్గరగా పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను అందిస్తుంది.

Moto X40 likely to launch at Motorola’s December 15 event

Moto X40 likely to launch at Motorola’s December 15 event

Read Also : Moto E22s in India : రూ.10వేల లోపు ధరలో భారీ బ్యాటరీతో మోటో E22s 4G స్మార్ట్ ఫోన్.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

మోటో X0 ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో రావచ్చు. వాటర్ ప్రొటెక్షన్ కోసం IP రేటింగ్ వంటి ఫీచర్లపై క్లారిటీ లేదు. స్టీరియో స్పీకర్‌లతో వస్తుందని HDR 10+, DC డిమ్మింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, మరిన్నింటికి సంబంధించిన సపోర్ట్ వివరాలు ఇంకా ఉన్నాయి. Moto X40 4,450mAh బ్యాటరీని ప్యాక్‌తో రావొచ్చునని లీక్స్ పేర్కొంది. కొన్ని నివేదికల్లో కంపెనీ 68W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టు అందిస్తుందని పేర్కొంది. వెనుకవైపు, రెండు 50-MP సెన్సార్‌లు, 12-MP తృతీయ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 32-MP సెన్సార్‌ని చూడవచ్చు.

Motorola Moto X40 ఏ సెన్సార్‌తో రానుందని అనేది వివరాలు రివీల్ చేయలేదు. డిసెంబర్ 15న లాంచ్ ఈవెంట్లో అనేక వివరాలను వెల్లడించవచ్చు. Motorola కూడా Moto X40ని గ్లోబల్ మార్కెట్‌కు భావిస్తున్నారు, కానీ Moto Edge 40 సిరీస్‌గా రావొచ్చు. ప్రస్తుతానికి, కొత్త స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్, ఇతర ప్రాంతాలకు ఎప్పుడు వస్తుందనే ఎలాంటి సమాచారం లేదు. ముందున్న Moto Edge 30 ఈ ఏడాదిలో మేలో భారత్ మార్కెట్లో లాంచ్ అయింది. Moto Edge 40 భారత మార్కెట్లో 2023లో లాంచ్ అవుతుందా లేదా Moto Edge 30 స్మార్ట్‌ఫోన్ ప్రకటించిన సమయంలోనే లాంచ్ అవుతుందా అనేది వేచి చూడాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Moto G13 Smartphone : మోటోరోలా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!