Motarola : మోటో జీ31 లాంఛ్‌..ధ‌ర ఎంతంటే!

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola కొత్త స్మార్ట్‌ఫోన్ 'Moto G31'ని విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా మీరు ఈ ఫోన్ బుక్ చేసుకోవచ్చు

10TV Telugu News

Motarola : స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola కొత్త స్మార్ట్‌ఫోన్ ‘Moto G31’ని విడుదల చేసింది. ఇది 6.4 అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్‌ప్లే, MediaTek Helio G85 ప్రాసెసర్, 50MP రియల్ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.ఈ ఫోన్ ధరల విషయానికి వస్తే.. 4GB RAM+64GB స్టోరేజ్ ఫోన్ ధర రూ.12,999 కాగా 6GB RAM+128GB స్టోరేజ్ ఫోన్ రూ.14,999గా ఉంది.

చదవండి : One Moto Global : ఇండియాకు యూకే రెండు EV స్కూటర్లు.. బుకింగ్స్ ప్రారంభం!

Moto g31 IPX2 వాటర్ రిపెల్లెంట్ ప్లస్ స్కిడ్, ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్‌తో అందమైన డిజైన్‌ను కలిగి ఉంది. Moto g31 రెండు రంగులలో అందుబాటులో ఉంటుంది. స్పెసిఫికేషన్ల పరంగా, స్మార్ట్‌ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.4-అంగుళాల పూర్తి HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) OLED హోల్-పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Moto g31 ఆండ్రాయిడ్ 11 స్టాక్ సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ (నానో+ నానో/మైక్రో SD)ని కలిగి ఉంది.

చదవండి : Moto Watch 100 : మోటరోలా కొత్త స్మార్ట్‌వాచ్ వస్తోంది… ఫీచర్లు ఇవేనా?

Moto G31లో 50MP ప్రధాన సెన్సార్, 8MP వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. వెనుక కెమెరా మోడ్‌లలో డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, పోర్ట్రెయిట్ లాటివి ఉన్నాయి. దీని ముందు భాగంలో 13MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

×