Motorola Razr 40 Series : ఒప్పో, శాంసంగ్‌ ఇక కాస్కోండి.. మడతబెట్టే మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది.. ఖతర్నాక్ ఫీచర్లు..!

Motorola Razr 40 Series Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది. ఒప్పో, శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకు పోటీగా వస్తోంది. కొత్త Razr 40 సిరీస్‌లో రెండు ఫోన్‌లు ఉన్నాయి.

Motorola Razr 40 Series : ఒప్పో, శాంసంగ్‌ ఇక కాస్కోండి.. మడతబెట్టే మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది.. ఖతర్నాక్ ఫీచర్లు..!

Motorola Razr 40 Series confirmed to launch in India soon to rival Oppo and Samsung folding phone

Motorola Razr 40 Series Launch in India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటోరోలా (Motorola) నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లోకి మోటోరోలా రేజర్ 40 (Motorola Razr 40 Series) సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త Razr 40 సిరీస్ ఫోన్.. Razr 40, Razr 40 Ultra అనే రెండు ఫోన్‌లు ఉండనున్నాయి. (Samsung Galaxy Z Flip 4), (Oppo Find N2 Flip) మాదిరిగా ఉంటాయి. 2020లో భారత మార్కెట్లో మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రారంభించగా.. పాత జనరేషన్ మోడల్ చాలా ఖరీదైనదిగా చెప్పవచ్చు. మోటోరోలా గత రెండు ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా Razr ఫోన్‌లతో ప్రయోగాలు చేస్తోంది. భారత్‌లో Razr 40 సిరీస్ తక్కువ ధరకే రావొచ్చు.

మోటోరోలా కొత్త Razr 40 సిరీస్ అమెజాన్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, భారత్‌లో ఇతర ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా రిటైల్ అవుతుందని పేర్కొంది. మోటోరోలా ఇండియా (Motorola India) వెబ్‌సైట్‌లో కూడా ఈ రెండు డివైజ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. లాంచ్ తేదీని కంపెనీ రివీల్ చేయలేదు. అయితే, ఇది జూలైలో కావొచ్చు. శాంసంగ్, వన్‌ప్లస్ కూడా వచ్చే నెలలో కొత్త ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయని లీక్‌లు సూచిస్తున్నాయి. 2023లో ఇప్పటికే టెక్నో, గూగుల్ వంటి సెగ్మెంట్‌లో కొత్త ప్లేయర్‌లు ఎంట్రీ ఇచ్చాయి.

Read Also : Apple iOS 17 Beta : ఆపిల్ ఐఓఎస్ 17 బీటా.. ఈ పాపులర్ ఐఫోన్లలో పనిచేయదట.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

భారత మార్కెట్లో మోటోరోలా Razr 40, Razr 40 Ultra అధునాతన ఫీచర్లతో రానున్నాయి. ఈ ఫోన్‌లో వనిల్లా రేజర్ 40 కన్నా పెద్ద కవర్ స్క్రీన్ ఉంది. కవర్ డిస్‌ప్లే Samsung, Oppo ఆఫర్‌ల కన్నా చాలా పెద్దది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 3.6 అంగుళాల వ్యూను అందిస్తుంది. మోటోరోలా Razr 40 మాదిరిగానే ఫోల్డ్ ఓపెన్ చేస్తే.. వినియోగదారులు 6.9 అంగుళాల వ్యూను ఆస్వాదించవచ్చు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు బయట డ్యూయల్ కెమెరాలను కలిగి ఉన్నాయి, అయితే స్పెసిఫికేషన్‌లు మాత్రం భిన్నంగా ఉంటాయి.

Motorola Razr 40 Series confirmed to launch in India soon to rival Oppo and Samsung folding phone

Motorola Razr 40 Series confirmed to launch in India soon to rival Oppo and Samsung folding phone

అల్ట్రా మోడల్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్టుతో 12MP ప్రైమరీ సెన్సార్, 13MP సెకండరీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. వనిల్లా రేజర్ 40 సిరీస్ 64MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. రెండు ఫోన్‌లలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. వినియోగదారులు సెల్ఫీల కోసం కవర్ డిస్‌ప్లేలో ఫొటో ప్రివ్యూకు బయటి కెమెరాలను ఉపయోగించవచ్చు.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. బోర్డులోని చిప్‌సెట్‌లు కూడా భిన్నంగా ఉంటాయి. Razr 40 Ultra ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని కలిగి ఉంది. అయితే, Razr 40 స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 SoCని కలిగి ఉంటుంది. సాధారణ Razr 40లో స్నాప్‌డ్రాగన్ 7 Gen 1ని అందించే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ Z Flip 4, Oppo బేస్ 128GB వేరియంట్ ధర రూ. 89,999గా ఉంది. Motorola ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లు భారత మార్కెట్లో మరింత సరసమైనవిగా ఉన్నాయి. భారత మార్కెట్లో Razr 40, Razr 40 Ultra ధర ఎంత ఉంటుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది.

Read Also : Samsung Galaxy F54 5G Launch : కొత్త 5G ఫోన్ కావాలా? శాంసంగ్ నుంచి దిమ్మతిరిగే ఫీచర్లతో F54 సిరీస్.. కొంటే ఈ ఫోన్ కొనాలి!