Motorola Razr Plus 2023 : మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Motorola Razr Plus : మోటోరోలా నుంచి Razr Plus 2023 అనే కొత్త ఫోల్డబుల్ ఫోన్ రాబోతోంది. ఈ ఫోన్ డిజైన్ రెండర్‌లు గతంలో లీక్ అయ్యాయి. ఈ డివైజ్ డ్యూయల్-కలర్ వెనుక ప్యానెల్‌తో వచ్చే అవకాశం ఉంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది.

Motorola Razr Plus 2023 : మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Motorola Razr Plus 2023 Reportedly Spotted on FCC,

Motorola Razr Plus 2023 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటోరోలా (Motorola) నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ రాబోతోంది. రేజర్ ప్లస్ 2023 (Razr Plus) పేరుతో త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. టాప్ లెనోవా ఎగ్జిక్యూటివ్ కొన్ని వారాల క్రితమే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో ప్రదర్శించింది. కంపెనీ నెక్స్ట్ జనరేషన్ Razr స్మార్ట్‌ఫోన్‌లపై పనిచేస్తోందని ధృవీకరించింది.

(Motorola Razr Plus) పేరుతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని గతంలో నివేదిక సూచించింది. మునుపటి డిజైన్ రెండర్ లీక్‌లను పరిశీలిస్తే.. అద్భుతమైన ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ (FCC) వెబ్‌సైట్‌లో ఈ కొత్త మోడల్ కనిపించిందని కొత్త నివేదిక వెల్లడించింది.

Read Also : Hyundai Motor Discounts : ఈ మార్చిలో హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. 12 మోడళ్లపై అదిరే ఆఫర్లు.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి!

(MySmartPrice) నివేదిక ప్రకారం.. మోటోరోలా Razr Plus 2023 డివైజ్ FCC వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ XT2321తో లిస్టు అయింది. ఈ జాబితా ప్రకారం.. రాబోయే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 5G సపోర్టుతో రానుంది. 3,640mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. గత వెర్షన్ల కన్నా పెద్దదిగా ఉంటుంది. మోటోరోలా Razr 2022 ఫోన్ 3,500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Motorola Razr Plus 2023 Reportedly Spotted on FCC,

Motorola Razr Plus 2023 Reportedly Spotted on FCC

మోటోరోలా Razr Plus 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని గత నివేదిక సూచించింది. అయితే, FCC లిస్టింగ్ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని సూచించింది. మోటోరోలా రేజర్ ప్లస్ డివైజ్ గత వెర్షన్ల మాదిరిగానే 2.7-అంగుళాల ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని నివేదిక తెలిపింది.

మోటోరోలా Razr 2022 ఫోన్ కూడా Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ద్వారా గరిష్టంగా 12GB RAMతో వచ్చింది. ఆగస్ట్ 2022లో చైనాలో లాంచ్ అయింది. ఒకే శాటిన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. మోటోరోలా Razr 2022 బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 5,999 (దాదాపు రూ. 70,750)గా ఉంది. 8GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌ల ధరలు వరుసగా CNY 6,499 (దాదాపు రూ. 76,650), CNY 7,299 (దాదాపు రూ. 86,000)గా ఉన్నాయి.

Read Also : Motorola Moto G Stylus (2023) : మోటోరోలా నుంచి కొత్త మోటో G Stylus ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?