MS Dhoni: ధోనీ గిఫ్ట్ పెళ్లి రోజు కానుకేనా.. సాక్షి కోసం ప్రత్యేకమైన కారు

ఆటోమొబైల్స్ మీద ధోనీకి ఎంత క్రేజో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి వింటేజ్ కార్లంటే అమితమైన ఇష్టం. ఈ మాజీ కెప్టెన్ తన ఇంట్లో ఉండే మెగా గ్యారేజ్ లో అవే ఎక్కువగా కనిపిస్తాయి.

MS Dhoni: ధోనీ గిఫ్ట్ పెళ్లి రోజు కానుకేనా.. సాక్షి కోసం ప్రత్యేకమైన కారు

Ms Dhoni Gift (1) (1)

MS Dhoni: ఆటోమొబైల్స్ మీద ధోనీకి ఎంత క్రేజో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి వింటేజ్ కార్లంటే అమితమైన ఇష్టం. ఈ మాజీ కెప్టెన్ తన ఇంట్లో ఉండే మెగా గ్యారేజ్ లో అవే ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి ఒక వింటేజ్ వోల్క్‌స్వాగన్ బీటిల్ ను తన భార్యకు గిఫ్ట్ గా ఇచ్చారు. కొద్ది రోజుల్లో పూర్తి కానున్న 11వ సంవత్సర పెళ్లిరోజు వేడుకకు ఇచ్చినట్లుగా చాలా కథనాల్లో ప్రచురితమయ్యాయి.

ఈ కార్ గిఫ్ట్ ను సాక్షి ఇన్ స్టాగ్రామలో పంచుకుని తాను గిఫ్ట్ పొందానని చెప్పిందే కానీ, అది ఇచ్చిన పర్సన్ పేరు చెప్పలేదు. థ్యాంక్యూ ఫర్ ద యానివర్సరీ గిఫ్ట్ అని చెప్పింది. మహేంద్ర సింగ్ ధోనీ టేస్ట్ కు తగ్గట్లుగా ఉన్న కారు కనిపిస్తుండగా వేరే ఎవరో అది ఇచ్చారని ఊహించనక్కర్లేదు.

కొత్త గిఫ్ట్ బ్లూ అండ్ వైట్ కలర్స్ లో మెరిసిపోతూ ధోనీ ఇంట్లో పార్క్ చేసి ఉంది. కార్ ఒక పక్క పిక్చర్ మాత్రమే పెట్టడంతో అది ఏ సంవత్సరం మోడల్ అనేది కూడా స్పష్టత రావడం లేదు. కాకపోతే గ్రేట్ కండిషన్ లో ఉందని మాత్రం చెప్పొచ్చు.

ధోనీకి ఎన్ని కార్లు ఉన్నా.. ఇంట్లోంచి బయటకు వచ్చేది చాలా తక్కువే. జార్ఖండ్ లోని రాంచీలో కుటుంబంతో కలిసి ఉండే ధోనీ తన స్థలంలోనే వాటిలో తిరుగుతుంటారు. ఎప్పటి నుంచో గ్యారేజిలో కార్లు యాడ్ చేసేందుకే ఇంట్రస్ట్ చూపిస్తుంటారు ధోనీ. రీసెంట్ గా 1969 ఫోర్డ్ ముస్తంగ్ ను చేర్చారు. గతంలో చాలా సినిమాల్లో కనిపించిన కార్.. చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది.