Mumbai Woman Train Ticket : ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ వివరాలను షేర్ చేసిన మహిళ.. రూ.64వేలు కొట్టేశారు.. అసలేం జరిగిందంటే?

Mumbai Woman Train Ticket : సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఏదైనా మీ డేటాను షేర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పోస్టు చేయరాదని గుర్తించాలి.

Mumbai Woman Train Ticket : ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ వివరాలను షేర్ చేసిన మహిళ.. రూ.64వేలు కొట్టేశారు.. అసలేం జరిగిందంటే?

Mumbai woman tweets train ticket details online, loses Rs 64,000: here is what happened

Mumbai Woman Train Ticket : సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఏదైనా మీ డేటాను షేర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఫేస్‌బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి ప్లాట్‌ఫారమ్‌ల్లో మీ వివరాలను పోస్టు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పోస్టు చేయరాదని గుర్తించాలి. ఎందుకంటే.. చిన్న నిర్లక్ష్యం చేసినా అనేక పరిణామాలకు దారితీస్తుంది. ఇటీవల ఒక కేసుకు సంబంధించి.. మహిళ రైలు టిక్కెట్ల వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా సైబర్ మోసగాళ్లకు సుమారు రూ.64వేలు పోగొట్టుకుంది.

విలే పార్లే ముంబై నివాసి IRCTC ట్విట్టర్ హ్యాండిల్‌లో RAC టికెట్ వివరాలను షేర్ చేయడంతో రూ. 64వేలు దొంగిలించారని నివేదించింది. నివేదిక ప్రకారం.. MN మీనా జనవరి 14న భుజ్‌కు వెళ్లడానికి IRCTC సైట్‌లో 3 టిక్కెట్‌లను బుక్ చేసింది. అన్ని సీట్లు దాదాపుగా బుక్ అయ్యాయి. బాధిత మహిళకు RAC (రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్) సీట్లు లభించాయి. వెరిఫై అయిన తర్వాత ప్రయాణీకులు సంబంధిత రైలు ఎక్కకపోతే.. RAC టికెట్‌తో ప్రయాణీకుడికి పూర్తి బెర్త్ కేటాయించడం జరుగుతుంది. లేని పక్షంలో, RAC ప్రయాణీకుడు సీటును మరొకరికి షేర్ చేయాల్సి ఉంటుంది.

Read Also : 5G Scam : వోడాఫోన్ ఐడియా యూజర్లు జాగ్రత్త.. మీ ఫోన్‌కు ఇలా 5G నెట్‌‌వర్క్ మెసేజ్ వచ్చిందా? ఇదో పెద్ద స్కామ్.. ఈ లింక్ క్లిక్ చేయొద్దు!

RAC టిక్కెట్లు వెరిఫై చేశారో లేదో చెక్ చేయడానికి, 34 ఏళ్ల మహిళ రైలు టికెట్ వివరాలను, మొబైల్ నంబర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత IRCTCని సాయాన్ని కోరింది. కాసేపటి తర్వాత బాధిత మహిళ మీనాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆమె కొడుకు ఫోన్ కాల్ మాట్లాడాడు. ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి తనను తాను IRCTC నుంచి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు. వారి RAC టికెట్‌ను వెరిఫై చేసేందుకు ఆఫర్ చేశాడు.

Mumbai woman tweets train ticket details online, loses Rs 64,000: here is what happened

Mumbai woman tweets train ticket details online, loses Rs 64,000

కాల్ చేసిన వ్యక్తి ఫోన్‌లో ఒక లింక్‌ను పంపాడు. మీనా కొడుకు వివరాలను చెప్పాలని, ప్రయాణ తేదీలో భుజ్‌కి వెళ్లే వారి రైలు టిక్కెట్‌ను పొందడానికి రూ. 2 చెల్లించమని అడిగాడు. మీనా, ఆమె కొడుకు ఇద్దరూ తమ ఫిర్యాదును ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో తమను IRCTC సంప్రదించిందని భావించారు. ఆమె కొడుకు ఫోన్ నింపి రూ. 2 చెల్లించాడు. మరికొద్ది క్షణాల్లోనే.. వారి బ్యాంకు అకౌంట్ల నుంచి బ్యాక్-టు-బ్యాక్ ట్రాన్సాక్షన్ హెచ్చరికలు అందాయి. బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ.64,011 నగదును మోసగాళ్లు ఎత్తుకెళ్లారు.

IRCTC ట్విట్టర్ పేజీలో ఫిర్యాదును ట్వీట్ చేసిన కొంత సమయం తర్వాత ఫోన్ కాల్ రావడంతో ఆమె కుమారుడు నమ్మాడు. కాలర్ తాను IRCTC కస్టమర్ కేర్ నుంచి వచ్చానని పేర్కొన్నాడు. రైలు టిక్కెట్‌ను వెరిఫై చేయమని చెప్పాడు. యూజర్ వివరాలను నింపమని అడిగాడు. మొబైల్‌లో పంపిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా బ్యాంక్ వివరాలు, ఇతర డేటాను యాక్సస్ చేసుకున్నాడు. ఆ తర్వాత మొబైల్‌లో ఐదు లావాదేవీలు జరిగినట్టు మెసేజ్ వచ్చింది.

పోలీసులు వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు.. UPI ద్వారా RS2 చెల్లించమని అడిగాడు. ఒక లింక్ ద్వారా వివరాలను అందించాలని అడిగాడు. ఫిషింగ్ లింక్ ద్వారా మీనా బ్యాంక్ అకౌంట్ UPI సెక్యూరిటీ కోడ్ వివరాలను మోసగాళ్లు దొంగిలించినట్లు తెలుస్తోంది. మోసగాళ్లు ట్విట్టర్‌లో మీనా పోస్ట్ ద్వారా ఆమె నంబర్‌ను పొందారు. అందుకే రైలు టిక్కెట్ వివరాలను ఆన్‌లైన్‌లో షేర్ చేయవచ్చు. ఆ కేసును అనుసరించి ఆన్‌లైన్‌లో సీక్రెట్ వివరాలను ఎప్పుడూ షేర్ చేయవద్దని ఫిషింగ్ లింక్‌ల పట్ల జాగ్రత్త వహించాలని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది. IRCTC లేదా ఇతర ప్రముఖ సంస్థలు ఎప్పుడూ ఆన్‌లైన్‌లో నగదు చెల్లించాలని అడగవని తప్పక గమనించాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also :  QR Code Scam : QR కోడ్ స్కామ్‌తో తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి స్కామర్ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలి? ఎలా గుర్తించాలో తెలుసా?