MY23 Renault Cars 2023 : రెనాల్ట్ ఇండియా నుంచి అదిరే ఫీచర్లతో 3 సరికొత్త కార్లు.. ఏయే కారు మోడల్ ధర ఎంత ఉందంటే? పూర్తి వివరాలు మీకోసం..!

MY23 Renault Cars : రెనాల్ట్ ఇండియా (Renault India) సరికొత్త మోడల్ కార్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. రెనాల్ట్ కిగర్ (Renault Kiger), ట్రైబర్ (Triber Car), క్విడ్ (Kwid Cars) అనే మూడు కార్లు 2023 మోడల్ ఇయర్ (MY) రేంజ్, మెరుగైన భద్రతా ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.

MY23 Renault Cars 2023 : రెనాల్ట్ ఇండియా నుంచి అదిరే ఫీచర్లతో 3 సరికొత్త కార్లు.. ఏయే కారు మోడల్ ధర ఎంత ఉందంటే? పూర్తి వివరాలు మీకోసం..!

MY23 Renault Cars _ 2023 Renault Kiger, Triber, Kwid launched; all cars now RDE-compliant

MY23 Renault Cars : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ రెనాల్ట్ ఇండియా (Renault India) సరికొత్త మోడల్ కార్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. రెనాల్ట్ కిగర్ (Renault Kiger), ట్రైబర్ (Triber Car), క్విడ్ (Kwid Cars) అనే మూడు కార్లు 2023 మోడల్ ఇయర్ (MY) రేంజ్, మెరుగైన భద్రతా ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.

ఈ కార్లు ఇప్పుడు రియల్ డ్రైవింగ్ ఉద్గారాల (RDE) నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అప్‌డేట్ రేంజ్ కార్ల కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. 2023 రెనాల్ట్ కిగర్, 2023 రెనాల్ట్ ట్రైబర్, 2023 రెనాల్ట్ క్విడ్ కార్లు ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్లతో వస్తున్నాయి.

MY23 Renault Cars _ 2023 Renault Kiger, Triber, Kwid launched; all cars now RDE-compliant

MY23 Renault Cars _ 2023 Renault Kiger, Triber, Kwid launched

Read Also : Cars Delivery: ఈ కార్ల డెలివరీ కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సిందే.. ఏ కారు కోసం ఎన్ని నెలలంటే?

RDE నిబంధనల అమలుతో.. అన్ని రెనాల్ట్ కార్లు ఆటో-డయాగ్నోస్టిక్ డివైజ్ కలిగి ఉంటాయి. ఈ డివైజ్ కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనం ఉద్గార స్థాయిలను నిరంతరం మానిటరింగ్ చేస్తుంది. ఉత్ప్రేరక కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్లు వంటి ఇతర క్లిష్టమైన ఉద్గార డివైజ్‌లను కలిగి ఉన్నాయి. రెనాల్ట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌, క్విడ్ లైనప్‌కు కొత్త వేరియంట్ RXEని కూడా యాడ్ చేసింది. క్విడ్ RXE 1.0 MT ధర రూ. 4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

MY23 Renault Cars _ 2023 Renault Kiger, Triber, Kwid launched; all cars now RDE-compliant

MY23 Renault Cars _ 2023 Renault Kiger, Triber, Kwid launched

MY23 రెనాల్ట్ కార్ల ధరలు (ఎక్స్-షోరూమ్) ఎలా ఉన్నాయంటే? :

* 2023 రెనాల్ట్ కిగర్ – రూ. 6 లక్షలు – రూ. 10.77 లక్షలు
* 2023 రెనాల్ట్ ట్రైబర్ – రూ. 6 లక్షలు – రూ. 8.63 లక్షలు
* 2023 రెనాల్ట్ క్విడ్ – రూ. 4.69 లక్షలు – రూ. 5.99 లక్షలు

MY23 Renault Cars _ 2023 Renault Kiger, Triber, Kwid launched; all cars now RDE-compliant

MY23 Renault Cars _ 2023 Renault Kiger, Triber, Kwid launched

రెనాల్ట్ ఇండియా (Renault India Cars) భారత ప్రభుత్వ క్లీన్ అండ్ గ్రీన్ ఇన్విరాన్‌మెంట్ నిబంధనలకు కట్టుబడి ఉంది. ఈ కొత్త BS6 స్టెప్ 2-కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్‌ రేంజ్ ద్వారా ఉద్గారాలలో గణనీయమైన తగ్గింపును అందిస్తుంది. ఈ మూడు రెనాల్ట్ కార్లలో సెక్యూరిటీ పరంగా చాలా సురక్షితమైనదిగా కంపెనీ చెబుతోంది. కొత్త 2023 రేంజ్ కొత్త క్లాస్-లీడింగ్ సేఫ్టీ ఫీచర్లతో పాటు భారతీయ కస్టమర్లకు అందుబాటులో ఉండేలా అత్యున్నత ప్రపంచ భద్రత ప్రమాణాలను అందించగల ప్రొడక్టులను అందించే దిశగా రెనాల్ట్ అడుగులు వేస్తోందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : 5 Best Cars Audio Systems : 2023లో కొత్త కారు కొంటున్నారా? ప్రీమియం ఆడియో సిస్టమ్‌తో వచ్చిన 5 బెస్ట్ కార్లు ఇవే.. మీకు నచ్చిన కారు కొనేసుకోండి!