Netflix Gaming Plans : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అదిరే ఆఫర్.. ఇకపై ప్రతినెలా కొత్త గేమ్స్ ఆడుకోవచ్చు.. కొత్త గేమింగ్ ప్లాన్లు ఇవే..!

Netflix Gaming Plans : నెట్‌ఫ్లిక్స్ తన గేమింగ్ కంటెంట్‌ను విస్తరించే ప్లాన్లను ప్రకటించింది. రాబోయే నెలల్లో వినియోగదారుల కోసం ప్లే చేసేందుకు అందుబాటులో ఉండే అనేక క్యాప్షన్లతో కూడిన గేమింగ్ ప్లాన్లను ప్రకటించింది.

Netflix Gaming Plans : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అదిరే ఆఫర్.. ఇకపై ప్రతినెలా కొత్త గేమ్స్ ఆడుకోవచ్చు.. కొత్త గేమింగ్ ప్లాన్లు ఇవే..!

Netflix Gaming Plans _ Netflix reveals plans to expand gaming library, users to get new games every month

Netflix Gaming Plans : ప్రస్తుతం ఆన్‌లైన్‌లో గేమింగ్ ఇండస్ట్రీ (Gaming Industry)కి ఫుల్ డిమాండ్ పెరిగింది. అందులోనూ ప్రపంచంలో గేమింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఒకటిగా ఉంది. నివేదికల ప్రకారం.. కొవిడ్ లాక్‌డౌన్ (Covid Lockdown) సమయంలో ఎంటర్‌‌టైన్మెంట్ కోసం సెర్చ్ చేసేవారి సంఖ్య పెరిగింది. అప్పుడే గేమింగ్ పరిశ్రమ వృద్ధిని మరింత వేగవంతం చేసింది. రాబోయే సంవత్సరాల్లో, గేమింగ్ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ కంపెనీల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ (Netflix) గేమింగ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. నెట్‌ఫ్లిక్స్ ఒక ఏడాది క్రితమే తన ప్లాట్‌ఫారమ్‌లో అనేక కొత్త గేమ్‌లను ప్రారంభించింది. జూలై 2021లో కంపెనీ తన గేమింగ్ కేటగిరీ నిర్వహణకు మాజీ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, ఫేస్‌బుక్ (Facebook) ఎగ్జిక్యూటివ్ మైక్ వెర్డు (Mike Verdu)ను నియమించుకున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు, నెట్‌ఫ్లిక్స్ తన గేమింగ్ కంటెంట్‌ను విస్తరించే ప్లాన్లను ప్రకటించింది. రాబోయే నెలల్లో వినియోగదారుల కోసం ప్లే చేసేందుకు అందుబాటులో ఉండే అనేక క్యాప్షన్లతో కూడిన గేమింగ్ ప్లాన్లను ప్రకటించింది.

Read Also : Nokia C12 Pro Sale : నోకియా C12 ప్రో సేల్ మొదలైందోచ్.. కేవలం రూ.6,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

నెట్‌ఫ్లిక్స్ గేమింగ్ జెర్నీ ఎలా ఉందంటే? :
నెట్‌ఫ్లిక్స్ (Netflix) ద్వారా ఇప్పటివరకు గేమింగ్ జెర్నీ అద్భుతంగా కొనసాగుతోంది. వినియోగదారుల కోసం కంపెనీ ఎంటర్‌టైన్మెంట్ సర్వీసులను విస్తరించడానికి నెట్‌ఫ్లిక్స్‌లో గేమ్‌లను ప్రారంభించి కూడా ఏడాది దాటింది. ఇంత తక్కువ సమయంలోనే 55 గేమ్‌లను కంపెనీ రిలీజ్ చేసింది. ఈ ఏడాది చివరిలో మరో 40 గేమింగ్‌లను తమ భాగస్వాములతో కలిసి రిలీజ్ చేయనుంది. మరో 70 గేమ్స్ డెవలప్‌మెంట్‌లో ఉన్నాయి.

Netflix Gaming Plans _ Netflix reveals plans to expand gaming library, users to get new games every month

Netflix Gaming Plans _ Netflix reveals plans to expand gaming library

ప్రస్తుతం ఇంటర్నల్ గేమ్ స్టూడియోలు అభివృద్ధి చేస్తున్న 16 గేమ్‌లకు అదనంగా గేమ్‌ల విస్తృత పోర్ట్‌ఫోలియోను డెవలప్ చేస్తోంది. వివిధ ఫార్మాట్‌లలో గేమ్ ప్లాన్లను అందించనుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాదిలో గేమింగ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని భావిస్తోంది. తమ వినియోగదారుల కోసం ప్రతి నెలా కొత్త గేమ్‌లను ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాదిలో పోర్ట్‌ఫోలియోలో ప్రతి నెలా కొత్త గేమ్‌లను చేర్చనుంది. నెట్‌ఫ్లిక్స్ మెంబర్లు, ఇండీ డార్లింగ్‌లు, అవార్డు గెలుచుకున్న హిట్‌లు, RPGలు, పజిల్ గేమ్‌లను పొందవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో కొత్త గేమ్‌లు :
నెట్‌ఫ్లిక్స్ రాబోయే నెలల్లో రిలీజ్ చేయబోయే అనేక కొత్త గేమ్‌లను కూడా ప్రకటించింది. ఈ గేమ్‌లు నానోబిట్ (Nonobit) భాగస్వామ్యంతో కొత్త టూ హాట్ టు హ్యాండిల్ గేమ్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి రానుంది. మైటీ క్వెస్ట్: రోగ్ ప్యాలెస్ (Mighty Quest: Rogue Palace) ఏప్రిల్ 18 నుంచి అందుబాటులో ఉంటుంది, హైవాటర్, టెర్రా నిల్, మాన్యుమెంట్ వ్యాలీ 1, మాన్యుమెంట్ వ్యాలీ 2 కూడా వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ షో ఆధారంగా మరొక గేమ్ ప్రముఖ గేమ్ డెవలపర్ సూపర్ ఈవిల్ మెగాకార్ప్ (Super Evil Megacorp) భాగస్వామ్యంతో రానుంది.

Read Also : OnePlus Nord CE 3 Lite : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?