NETFLIX: కొన్ని దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ రేట్లు పెంచేసిన నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ రేట్లు కొన్నిదేశాల్లో పెంచుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. రీసెంట్ గా ఇండియాలో రేట్లు తగ్గించిన ప్రముఖ ఓటీటీ యునైటెడ్ స్టేట్స్, కెనడాల్లో మాత్రం

NETFLIX: కొన్ని దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ రేట్లు పెంచేసిన నెట్‌ఫ్లిక్స్

Netflix

NETFLIX: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ రేట్లు కొన్నిదేశాల్లో పెంచుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. రీసెంట్ గా ఇండియాలో రేట్లు తగ్గించిన ప్రముఖ ఓటీటీ యునైటెడ్ స్టేట్స్, కెనడాల్లో మాత్రం ధరలను పెంచుతున్నట్లు పేర్కొంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధరలను ఒక డాలర్ నుంచి రెండు డాలర్లకు పెంచింది.

అదే ఇండియాలో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ధర రూ.149గా ఉంది. యునైటెడ్ స్టేట్స్ లో స్టాండర్డ్ ప్లాన్ ను 14డాలర్ల నుంచి 15.50డాలర్లకు పెంచింది. గతంలో 18డాలర్లుగా ఉన్న 4కే ప్లాన్ 20డాలర్లకు పెంచారు.

కెనడాలోనూ పెరిగిన ధరలతో 14.99గా ఉన్న కెనడియన్ డాలర్లు 16.49కు పెంచారు. ఈ ప్రీమియం ప్లాన్ కూడా 2కెనడియన్ డాలర్ల నుంచి 20.99కెనడియన్ డాలర్ల వరకూ ధరలు పెరిగాయి. కాకపోతే బేసిక్ ప్లాన్ లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.

ఇది కూడా చదవండి: బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు

క్వాలిటీ ఎంటర్ టైన్మెంట్ అందించే దిశగా మా ధరల్లో మార్పులు చేస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఎప్పుడూ మా వినియోగదారులకు అనుకూలంగా ఉండే ప్యాకేజీలనే అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.