Netflix: నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్.. మీకు కావాల్సినంత డౌన్‌లోడ్ చేసుకుని చూసేయొచ్చు

ఇండియాలోని నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు చాలా పెద్ద గుడ్ న్యూస్. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా.. తక్కువ సిగ్నల్ తో కూడిన కనెక్షన్ ఉన్నా.. ఈ కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

Netflix: నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్.. మీకు కావాల్సినంత డౌన్‌లోడ్ చేసుకుని చూసేయొచ్చు

Netflix

Netflix: ఇండియాలోని నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు చాలా పెద్ద గుడ్ న్యూస్. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా.. తక్కువ సిగ్నల్ తో కూడిన కనెక్షన్ ఉన్నా.. ఈ కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. యాండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఫోన్ యూజర్లకు సైతం ఇది ఉపయోగకరం అవుతుందని అంటున్నారు.

యూజర్లు నెట్‌ఫ్లిక్స్ నుంచి ఏదైనా సినిమా డౌన్ లోడ్ చేసుకుని చూడాలంటే సిగ్నల్ పూర్తిగా అందేచోటనే ఉండాల్సిన అవసరం లేదు.

‘ఫేవరేట్ సిరీస్ లేదా సినిమాలు భాషతో సంబంధం లేకుండా కనెక్టివిటీ మీద ఆధారపడకుండా చూసేయండి. ఇప్పుడు పాక్షికపరమైన డౌన్‌లోడింగ్ కూడా అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్ యూజర్లు, ఐఫోన్ వినియోగదారులు ఎవరైనా రాబోయే కొద్ది నెలల్లో ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు’ అని అఫీషియల్ బ్లాగ్ లో రాసుకొచ్చింది.

ఈ ఫీచర్ బట్టి.. సరైన కనెక్టివిటీ ఉన్న చోట డౌన్‌లోడ్ చేసుకోవడం ఆ తర్వాత వీలుని బట్టి చూసుకోవచ్చు. ఇక డౌన్ లోడ్ అవుతుండగానే సినిమా లేదా సిరీస్ గురించి చూసి నచ్చకపోతే అప్పటికప్పుడే క్యాన్సిల్ చేసుకోవచ్చు కూడా.