Netflix Subscription Plan : మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ యాడ్ సపోర్టెడ్ ప్లాన్..!

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ప్లిక్స్ (Netflix) కొత్త సబ్ స్ర్కిప్షన్ ప్లాన్ తీసుకొస్తోంది. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నెట్ ప్లిక్స్.. మొదటి యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్‌ను లాంచ్ చేయనుంది.

Netflix Subscription Plan : మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ యాడ్ సపోర్టెడ్ ప్లాన్..!

Netflix Partners With Microsoft To Launch A Cheaper, Ad Supported Subscription Plan (1)

Netflix Subscription Plan : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ప్లిక్స్ (Netflix) కొత్త సబ్ స్ర్కిప్షన్ ప్లాన్ తీసుకొస్తోంది. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నెట్ ప్లిక్స్.. మొదటి యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్‌ను లాంచ్ చేయనుంది. నెట్ ప్లిక్స్ సబ్‌స్క్రైబర్ బేస్ తగ్గిపోతున్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ కొత్త యాడ్-సపోర్టెడ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త యాడ్ సపోర్టటెడ్ సబ్ స్ర్కిప్షన్ ప్లాన్ రెండు కంపెనీలు వేర్వేరు బ్లాగ్‌లలో ప్రకటించాయి. అయినప్పటికీ కొత్త యాడ్-సపోర్టెడ్ మోడల్ ఎప్పుడు లాంచ్ అవుతుందనేది, సబ్‌స్క్రిప్షన్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ టెక్నాలజీ, సేల్స్ పార్టనర్‌గా చేరినందుకు కంపెనీ హర్షం వ్యక్తం చేసింది. యాడ్ కోసం మైక్రోసాఫ్ట్‌ను విక్రయదారులు, నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులందరూ టీవీ ఇన్వెంటరీకి యాక్సస్ చేసుకోచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో అందించిన అన్ని యాడ్స్ మైక్రోసాఫ్ట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుత యాడ్స్ లేని ప్రాథమిక, ప్రామాణిక, ప్రీమియం ప్లాన్లను అందిస్తోంది. అయితే ఈ కొత్త సబ్ స్ర్కిప్షన్ ద్వారా కొత్త పాత కస్టమర్‌లకు అందుబాటులో కొనసాగుతాయని పేర్కొంది. Netflix COO గ్రెగ్ పీటర్స్ మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలానే దీర్ఘకాలమే లక్ష్యంగా కొనసాగాలని భావిస్తున్నామని తెలిపారు. యూజర్లకు ఆప్షన్లు, ప్రీమియం, లీనియర్ కన్నా మెరుగైన TV బ్రాండ్ యాడ్స్ ఎక్స్ పీరియన్స్ అందించనున్నట్టు తెలిపింది. ఈ నెల ప్రారంభంలో యాడ్ సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్, సోనీ పిక్చర్స్ టెలివిజన్‌లతో చర్చలు ప్రారంభించిందని రాయిటర్స్ నివేదించింది. కొత్త మోడల్ మొత్తం కేటలాగ్‌ను కవర్ చేయకపోవచ్చు. ఇంటర్నల్ ప్రొడక్షన్ యూనిట్, బిగ్ హాలీవుడ్ స్టూడియోల నుంచి టైటిల్‌లను మాత్రమే ఎంచుకోవచ్చు.

Netflix Partners With Microsoft To Launch A Cheaper, Ad Supported Subscription Plan

Netflix Partners With Microsoft To Launch A Cheaper, Ad Supported Subscription Plan

దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నెట్‌ఫ్లిక్స్ మొదటి త్రైమాసికంలో 2లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోగా.. 2.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. బలహీనపడిన ఆర్థిక వ్యవస్థ, రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో 7లక్షల మంది సభ్యులను కోల్పోయింది నెట్ ఫ్లిక్స్.. అంతేకాదు.. సబ్ స్ర్కిప్షన్ ధరలను కూడా భారీగా పెంచేసింది. దాంతో ఇతర పోటీదారులైన డిస్నీ, అమెజాన్‌ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఆసక్తికరంగా, డిస్నీ, డిస్నీ+ యాడ్-సపోర్టు ఉన్న టైర్‌ ప్లాన్ ప్రవేశపెట్టనున్నట్టు చెప్పింది. డిస్నీ+ హాట్‌స్టార్ అత్యంత ప్రీమియం వార్షిక ప్లాన్.. ఇప్పటికీ రూ. 1,500 ప్లాన్ ధరపై అందుబాటులో ఉంది. మరోవైపు, Netflix అత్యంత ప్రీమియం టైర్ వార్షిక ధర రూ. 7,788 (నెలకు రూ. 649) చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : Netflix Audio Upgrade : నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచర్.. ఏ డివైజ్‌లోనైనా సినిమా థియేటర్ వ్యూతో చూడొచ్చు!