New Mobile Battery : కొత్త బ్యాటరీ టెక్నాలజీ.. మీ స్మార్ట్‌ఫోన్ 5 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది!

కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం ఇటీవలే లిథియం-అయాన్ బ్యాటరీల కోసం ఒక న్యూ మొబైల్ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. స్మార్ట్‌ఫోన్‌లకు ఈ టెక్నాలజీ మరింత శక్తినివ్వనుంది.

New Mobile Battery : కొత్త బ్యాటరీ టెక్నాలజీ.. మీ స్మార్ట్‌ఫోన్ 5 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది!

New Battery Technology May Charge Your Smartphone In Under 5 Minutes (1)

New Mobile battery technology : ప్రపంచవ్యాప్తంగా మొబైల్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్లు సరికొత్త ఫీచర్లతో వస్తున్నాయి. కెమెరా ఫీచర్లకే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. కానీ, బ్యాటరీ లైఫ్ సామర్థ్యం విషయంలో ఇప్పటికీ కచ్చితమైన గ్యారెంటీ లేదనే చెప్పాలి. రానురాను కొత్త స్మార్ట్ ఫోన్లలోనూ బ్యాటరీ ఛార్జింగ్ సామర్థ్యం కూడా పెరిగిపోతుంది. ప్రస్తుత ఐఫోన్ మోడల్స్‌ను ఏడు ఏళ్ల క్రితం ఐఫోన్ల బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్‌తో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగైంది. అందుకే బ్యాటరీ లైఫ్ సామర్థ్యాన్ని పెంచే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

అందులో భాగంగానే బ్యాటరీ ఛార్జింగ్ పరిశోధనపై కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం ఇటీవలే లిథియం-అయాన్ బ్యాటరీల కోసం ఒక న్యూ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. స్మార్ట్‌ఫోన్‌లకు ఈ టెక్నాలజీ మరింత శక్తినివ్వనుంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. మీ స్మార్ట్ ఫోన్ కేవలం 5 నిమిషాల్లోనే స్పీడ్ గా ఛార్జ్ చేసుకోవచ్చునని టెక్ నిపుణులు అంటున్నారు. లిథియం-అయాన్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడంలో ఒక సమస్య ఉంది.

ఛార్జింగ్ స్పీడ్ మారితే అది వెంటనే వేడెక్కుతుంది లేదా పేలిపోతుంది. దాంతో కేంబ్రిడ్జ్ పరిశోధకులు ఒక పనిచేశారు.. బ్యాటరీ పవర్ సెల్స్.. ఎంతవరకు ఛార్జ్ చేయవచ్చునో  తెలుసుకున్నారు. ఛార్జింగ్ సమయాన్ని తగ్గించే మార్గాన్ని గుర్తించారు. ఛార్జింగ్ అయ్యే బ్యాటరీని దెబ్బతినకుండా ఉండేలా పరిమితి పెంచుకోవచ్చునని అంటున్నారు. ఇదేగానీ జరిగితే.. ఐఫోన్ 13 లాంటి రాబోయే కొత్త మోడల్ ఫోన్లలో ఛార్జింగ్ స్పీడ్ మరింత పెరగనుంది. ఆపిల్ ఇప్పటికే కొత్త టెక్నాలజీ సాయంతో M2 ప్రాసెసర్ రెడీ చేస్తోందని, నెక్స్ట్-జెన్ చిప్ ఈ ఏడాది చివరిలో కొత్త మ్యాక్ బూక్ (MacBook) మోడళ్లలో తీసుకొస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.