New car prices : 2021 ఏప్రిల్ నుంచి పెరగనున్న కొత్త కార్ల ధరలు

ఏప్రిల్ 1 నుంచి కొత్త కార్ల ధరలు పెరగనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు కార్ల ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలోనే కార్ల ధరలు పెరిగాయి.

New car prices : 2021 ఏప్రిల్ నుంచి పెరగనున్న కొత్త కార్ల ధరలు

India’s Only 2 Door Tata Indica Is As Crazy

New car prices from April 2021 : ఏప్రిల్ 1 నుంచి కొత్త కార్ల ధరలు పెరగనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు కార్ల ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలోనే కార్ల ధరలు పెరిగాయి. ఇప్పుడు కార్ మేకర్లు మళ్లీ కార్ల ధరలను పెంచనున్నారు. ఏయే కంపెనీల కార్ల ధరలు పెరగనున్నాయో ఓసారి చూద్దాం.. భారత ఆటో మొబైల్ మార్కెట్లో ఫోర్డ్, టయోటా, మారుతీ సుజూకీ, నిస్సాన్, డటసన్, రెనాల్ట్ కంపెనీ కార్ల ధరలు పెరగనున్నాయి.

ఫోర్డ్ కంపెనీ తమ కార్ మోడళ్లపై 3 శాతం ధర పెంచనుంది. అన్ని మారుతీ సుజూకీ మోడల్స్ ధరలు 1శాతం నుంచి 6 శాతానికి పెరగనున్నాయి. అలాగే టయోటా, నిస్సాన్, డట్ స్టన్, రెనాల్ట్ అన్ని రేంజ్ల కార్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. కార్ల ధరలు పెంచడానికి ఇన్ పుట్ కాస్ట్ పెరగడమే ప్రధాన కారణమని ఆటో మొబైల్ కంపెనీలు చెబుతున్నాయి.

ఏప్రిల్ 2021 కార్ల ధరలు :
ఫోర్డ్ కార్ల ధరలు : ఫోర్డ్ కంపెనీ తమ మోడల్ కార్ల అన్నిటిపై 3 శాతం పెంచనున్నట్టు ప్రకటించింది. మోడల్ నుంచి మోడల్ కార్లకు మధ్య ధరలో వ్యత్సాసం ఉండనుంది. యాస్పైర్, ఎకోస్పోర్ట్, ఎండెవర్, ఫిగో కార్ల ధరలు పెరగనున్నాయి.

టయోటా ధరలు :
టయోటా కంపెనీ కూడా భారత మార్కెట్లో అన్ని కార్ల మోడళ్లపై ధరలు పెంచనుంది. కామ్రీ, ఫర్చూనర్, గ్లెన్జా, ఇన్నోవా, క్రిస్టా, అర్బన్, క్రూయిజర్, వెల్ ఫైర్, యారిస్ మోడళ్లు ఉన్నాయి. ఈ మోడళ్లపై ఎంత ధర పెంచుతుందో కంపెనీ ప్రకటించలేదు.

మారుతీ సుజూకీ కారు.. SUV ధరలు :
మారుతీ సుజూకీ కంపెనీ మొత్తం అన్ని రేంజ్ కార్ల ధరలను పెంచుతోంది. ప్రస్తుత ఎక్స్ షోరూం ధరతో కలిపి 1శాతం నుంచి 6శాతం వరకు పెంచనుంది. కార్ల ధరల రేంజ్ రూ.5వేల నుంచి గరిష్టంగా రూ.34వేల వరకు ఉండనుంది. అది కూడా మోడల్ ను బట్టి కార్ల ధర పెరగనుంది. ప్రస్తుతం మారుతీ కార్ల లైనప్ లో ఆల్టో, బలెనో, కెలిరియో, సియాజ్, డిజైర్, ఎకో, ఎర్టిగా, ఇగ్నిస్, ఎస్-క్రాస్, ఎస్-ప్రెస్సో, స్విప్ట్, వితారా బ్రీజ్జా, వ్యాగన్ ఆర్, ఎక్స్ఎల్6 మోడళ్లు ఉన్నాయి.

నిస్సాన్ SUV ధరలు :
నిస్సాన్ కంపెనీ అన్ని కార్ల మోడల్ ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి కిక్స్, మాగ్నైట్ కార్ల ధరలు పెరగనున్నాయి. ఎన్ని కార్ల మోడళ్లపై ధర పెంచనుందో కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

డట్ స్టన్ కార్ల ధరలు :
నిస్సాన్ మాదిరిగానే డట్ స్టన్ కంపెనీ కూడా కార్ల ధరలను పెంచబోతోంది. ఎంత ధరను పెంచనుందో కంపెనీ ఇప్పటికీ ప్రకటించలేదు. డట్ స్టన్ కార్ల ధరలలో రెడిగో, గో, గో ప్లస్ కార్ల మోడళ్లు ఉన్నాయి.

రెనాల్ట్ ధరలు :
రెనాల్ట్ కార్ల కంపెనీ కూడా పలు కార్ల మోడళ్లపై ధరలను పెంచుతోంది. డస్టర్, కిజర్, కివిడ్, ట్రైబర్ మోడళ్లపై ధరలు పెంచనుంది. ఫ్రెంచ్ కార్ల మేకర్ కార్ల ధరలను ఎంత పెంచనుందో ఇంకా ప్రకటించలేదు.