ఇండియాలో New Honda City కారు వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

  • Published By: sreehari ,Published On : July 15, 2020 / 05:02 PM IST
ఇండియాలో New Honda City కారు వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా నుంచి కొత్త కారు భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఐదో జనరేషన్ New Honda City కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర (V MT పెట్రోల్ వేరియంట్) రూ.10.90 లక్షల నుంచి అందుబాటులో ఉండనుంది. మిడ్ సైజ్ సెడాన్ మాదిరి మూడు ఇంజిన్ గేర్ బాక్సులతో వచ్చింది. కొత్త హోండా సిటీ డీజిల్ వేరియంట్ ధర రూ.12.40 లక్షలతో ప్రారంభం అవుతుంది.

ఈ ధర సిగ్మెంట్లో ఇప్పటికే మార్కెట్లో పాపులర్ అయిన Hyundai Verna కారు మోడల్‌తో New Honda City పోటీ పడుతోంది. ఐదో జనరేషన్ సిటీ కారులో కొత్తగా 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. 121 bhp పవర్‌తో పాటు 145NM పీక్ టార్క్ ను కలిగి ఉంది.
New Honda City Launched in India Starting at Rs 10.90 Lakh

లేటెస్ట్ ఇట్రేషన్ కంటే ఇందులో 2 bhp పవర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త కారు ఇంజిన్ పర్ఫార్మెన్స్ ప్రస్తుత BS6 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ లో గేర్ బాక్సు ఆప్షన్లతో 6-స్పీడ్ మాన్యువల్, సివిటీ ఆటో ఉన్నాయి.

ఇందన పరంగా పెట్రోల్ వేరియంట్ 17.8kmpl కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది. డీజిల్ వేరియంట్లలో ARAI ప్రకారం.. 18.4kmpl కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. గత మోడల్ కారు కంటే న్యూ హోండా సిటీ డిజైన్ ఎట్రాక్టివ్‌గా కనిపిస్తుంది.. విశాలంగా, పొడుగ్గా ఉంది. 9-LED హెడ్ ల్యాంప్ సెటప్ కూడా ఉంది. ముందు భాగంలో థిక్ క్రోమ్ స్ట్రిప్ కూడా వచ్చింది.
New Honda City Launched in India Starting at Rs 10.90 Lakh taillights కొత్త లుక్ తో వచ్చాయి. సెడాన్ కారు కంటే గ్రాండ్ లుక్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Accord, Civic కారు మోడళ్ల మాదిరిగానే హోండా సిటీలో స్టయిలీస్ ఎలిమెంట్లు ఆకర్షణగా ఉన్నాయి.
New Honda City Launched in India Starting at Rs 10.90 Lakh క్యాబిన్ upholstery పరంగా చూస్తే.. Cabinలో కొన్నింటిని అప్ గ్రేడ్ తో వచ్చింది. ఇందులోని cushioning మునుపటి కంటే 3 రెట్లు ఎక్కువగానూ డాష్‌కు కొత్త 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ కూడా ఉంది. రియర్-వ్యూ మిర్రర్ కింద Lane-Keep కెమెరాతో సేఫ్టీని అందించారు.New Honda City Launched in India Starting at Rs 10.90 Lakh

లెఫ్ట్ ఇండికేటర్‌ ఆన్ చేసినప్పుడు సెంట్రల్ డిస్‌ప్లే యూనిట్‌లో లైవ్ ఫీడ్‌ను సూచిస్తుంది. అలాగే 6 ఎయిర్‌బ్యాగులు, EBDతో ABS, హ్యాండ్లింగ్ అసిస్ట్, హిల్ అసిస్ట్‌తో వస్తుంది. ఇందులో ultra-high tensile స్ట్రెంగ్ స్టీల్ ఫ్రేమ్‌ను చేర్చినట్టు కంపెనీ తెలిపింది.

హోండా సిటీ 2020 పెట్రోల్ వేరియంట్లు ఇవే :

  • V MT రూ. 10.90 లక్షలు
  • VX MT రూ. 12.60 లక్షలు
  • ZX MT రూ. 13.15 లక్షలు
  • V CVT రూ. 12.20 లక్షలు
  • VX CVT రూ. 13.56 లక్షలు
  • ZX CVT రూ. 14.45 లక్షలు

Honda City 2020 డీజిల్ వేరియంట్లు :

  •  V MT రూ. 12.40 లక్షలు
  • VX MT రూ. 13.76 లక్షలు
  • ZX MT రూ. 14.65 లక్షలు