New Virus Android Phone : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఈ కొత్త ‘డామ్’ వైరస్‌తో జాగ్రత్త.. మీ పర్సనల్ డేటా డేంజర్‌లో..!

New Virus Android Phone : ఆండ్రాయిడ్ ఫోన్లలో 'డామ్' వైరస్ వ్యాపిస్తే.. అది డివైజ్ సెక్యూరిటీని క్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. డివైజ్‌లో కాల్ రికార్డ్‌లు, హిస్టరీ వంటి సున్నితమైన డేటాను యాక్సెస్‌ పొందుతుంది.

New Virus Android Phone : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఈ కొత్త ‘డామ్’ వైరస్‌తో జాగ్రత్త.. మీ పర్సనల్ డేటా డేంజర్‌లో..!

New virus targets Android phone, steals call records, passwords and other sensitive data

New Virus Android Phone steals sensitive data : ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. ఆండ్రాయిడ్ ఫోన్‌లను లక్ష్యంగా చేసుకుని డేంజరస్ వైరస్ యూజర్ల కాల్ రికార్డ్‌లను హ్యాక్ చేయడం, పాస్‌వర్డ్‌లు మార్చేయడం, ఇతర సున్నితమైన డేటాను దొంగిలిస్తోంది. ఈ కొత్త వైరస్ ముప్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లకు హాని కలిగించే ‘డామ్’ అనే మాల్వేర్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఈ మాల్వేర్ మీ ఫోన్‌లోని కాల్ రికార్డ్‌లు, కాంటాక్ట్‌లు, బ్రౌజింగ్ హిస్టరీ, మీ కెమెరా వంటి వివిధ అంశాలకు అనధికారిక యాక్సెస్‌ను పొందగలదు. జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఈ అడ్వైజరీని జారీ చేసింది.

అడ్వైజరీ ప్రకారం.. ‘డామ్’ వైరస్ యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లకు దొరక్కుండా తప్పించుకోగలదు. ఈ వైరస్‌ను గుర్తించడం తొలగించడం కష్టమే. మీ డివైజ్ లాక్ చేసినా అన్‌లాక్ చేయగలదు. (ransomware)ని కూడా రన్ చేయగలదు. ఈ వైరస్ సాధారణంగా థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లు లేదా అవిశ్వసనీయ లింకులు లేదా గుర్తుతెలియని మూలాల నుంచి డౌన్‌లోడ్ చేసిన అప్లికేషన్‌ల ద్వారా మాల్ వేర్ వైరస్ ఇన్ఫెక్ట్ అవుతుంది. ‘డామ్’ వైరస్ ఆండ్రాయిడ్ ఫోన్‌కు సోకినప్పుడు.. డివైజ్ భద్రతా చర్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. వైరస్ ప్రభావితమైన డివైజ్‌ల్లోని కాల్ రికార్డ్‌లు, హిస్టరీ వంటి సున్నితమైన డేటాను యాక్సెస్‌ చేయగలదు.

Read Also : BGMI Preload Game : ఆండ్రాయిడ్ గేమర్లకు గుడ్‌న్యూస్.. మే 29 నుంచి BGMI ప్రీలోడ్ గేమ్ ఆడొచ్చు..!

మీ కాల్ రికార్డులు, కాంటాక్టులను హ్యాక్ చేయగలదు :
‘డామ్’ వైరస్ మీ ఫోన్ కాల్ రికార్డింగ్‌లు, కాంటాక్టులను హ్యాక్ చేయగలదు. కెమెరాను కూడా యాక్సెస్ చేయగలదు. మీ డివైజ్ పాస్‌వర్డ్‌లను కూడా ఎడిట్ చేయగలదని ప్రభుత్వ సలహాదారు పేర్కొంది. మీ ఫోన్ డేటాస్క్రీన్‌షాట్‌లను కూడా తీయవచ్చు, టెక్స్ట్ మెసేజ్‌లను (SMSలు) తస్కరించే అవకాశం ఉంది. ఫైల్‌లను డౌన్‌లోడ్ చేసి, మరో సైట్లలో అప్‌లోడ్ చేయవచ్చు. దొంగలిచిన డేటాను కమాండ్-అండ్-కంట్రోల్ సర్వర్‌కు పంపడం చేయవచ్చు. బాధితుడి ఫోన్‌లోని ఫైల్‌లను హైడ్ చేసేందుకు మాల్వేర్ AES అనే అధునాతన ఎన్‌క్రిప్షన్ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది. ఈ డివైజ్ స్టోరేజీ నుంచి ఇతర ఫైల్‌లు డిలీట్ చేసేలా చేస్తుంది. ఇలా హైడ్ చేసిన ఫైల్‌లు మాత్రమే ‘.enc’ ఎక్స్‌టెన్షన్ కలిగి ఉంటాయి. అదనంగా, ‘readme_now.txt’ పేరుతో ఒక నోట్ కూడా డిస్‌ప్లే అవుతుంది.

New virus targets Android phone, steals call records, passwords and other sensitive data

New virus targets Android phone, steals call records, passwords and other sensitive data

ఇలాంటి సైబర్ మోగసాళ్ల బారిన పడకుండా ఉండాలంటే అవిశ్వసనీయ వెబ్‌సైట్‌లను విజిట్ చేయడం లేదా అవిశ్వసనీయ లింక్‌లపై క్లిక్ చేయడం వంటివి చేయరాదని సైబర్‌సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. మీ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను లేటెస్టుగా అప్‌డేట్ చేసుకోవాలి. స్కామర్‌లు తరచుగా ఇమెయిల్-టు-టెక్స్ట్ సర్వీసులను ఉపయోగించి రియల్ ఐడెంటిటీని హైడ్ చేయొచ్చు. అసలైన మొబైల్ ఫోన్ నంబర్‌లుగా కనిపించని అనుమానాస్పద ఫోన్ నంబర్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకుల నుంచి చట్టబద్ధమైన SMS మెసేజ్‌లు సాధారణంగా ఫోన్ నంబర్‌కు బదులుగా బ్యాంక్ షార్ట్ నేమ్‌తో కూడిన సెండర్ IDని కలిగి ఉంటాయి.

చివరగా, ఆండ్రాయిడ్ యూజర్లు ‘bitly’ లేదా ‘tinyurl’ హైపర్‌లింక్‌లను కలిగి ఉన్నా షార్ట్ URLలతో వ్యవహరించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ URLలు డేంజరస్ వెబ్‌సైట్లకు రీడైరెక్ట్ అవుతాయి. మీ వ్యక్తిగత డేటాతో పాటు డివైజ్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేస్తాయి. తద్వారా ‘Dam’ మాల్వేర్ నుంచి నుండి మీ Android ఫోన్‌ను ప్రొటెక్ట్ చేయడంలో సాయపడతాయి.

Read Also : Amazon Huge Discounts : అమెజాన్‌లో 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ ఫోన్ డీల్స్ మిస్ చేసుకోవద్దు..!