New Year 2023 : వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 2023 న్యూ ఇయర్ స్టిక్కర్‌లను ఎలా పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్!

New Year 2023 : మరికొద్ది గంటల్లో 2023 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త ఏడాది సందర్భంగా అందరూ తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతుంటారు.

New Year 2023 : వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 2023 న్యూ ఇయర్ స్టిక్కర్‌లను ఎలా పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్!

New Year 2023 _ How to send new year stickers on Instagram and WhatsApp

New Year 2023 : మరికొద్ది గంటల్లో 2023 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త ఏడాది సందర్భంగా అందరూ తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతుంటారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా న్యూ ఇయర్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవచ్చు.

వీడియో కాల్‌ల ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ కావొచ్చు. కొత్త ఏడాది సందర్భంగా శుభాకాంక్షలు పంపేందుకు న్యూఇయర్ స్టిక్కర్‌లు కూడా షేర్ చేసుకోవచ్చు. మీ ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు స్టిక్కర్‌లను పంపాలనుకుంటున్నారా? అయితే, మీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో స్టిక్కర్‌లను ఎలా పంపాలో ఇప్పుడు చూద్దాం..

వాట్సాప్‌లో హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్లను ఎలా పంపాలంటే? :
హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్‌ (New Year Stickers)లను పంపడానికి, యూజర్లు ముందుగా వాటిని Google Play Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ముందుగా Play Storeకి వెళ్లి.. అక్కడ నుంచి మీకు నచ్చిన ఏదైనా స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు మీకు నచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి.. మీ WhatsApp అకౌంట్లో యాడ్ చేసుకోండి. వినియోగదారులు యాప్‌లో మల్టీ స్టిక్కర్ ప్యాక్‌లను కనుగొనవచ్చు. అన్నీ వాటి పక్కన ప్లస్ (+) ఆకారంలో యాడ్ బటన్‌తో ఉంటాయి. WhatsApp యాప్‌లో ఈ స్టిక్కర్‌లను యాడ్ చేయాలంటే Add బటన్‌పై Tap చేయండి.

New Year 2023 _ How to send new year stickers on Instagram and WhatsApp

New Year 2023 _ How to send new year stickers on Instagram and WhatsApp

Read Also : WhatsApp Multiple Chats : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లు త్వరలో మల్టీపుల్ చాట్లను ఒకేసారి ఎంచుకోవచ్చు..!

యాప్‌కి ఈ స్టిక్కర్‌లను యాడ్ చేసిన తర్వాత, వినియోగదారులు వాట్సాప్‌ ఓపెన్ చేయాలి. ఏదైనా కాంటాక్టుతో చాట్ విండోను ఓపెన్ చేయాలి. తమకు నచ్చిన స్టిక్కర్‌లను ఎంచుకోవడం ద్వారా ఏదైనా స్టిక్కర్‌ను పంపవచ్చు. వినియోగదారులు ఎమోజి సెక్షన్ ఓపెన్ చేసి స్టిక్కర్‌ల కోసం కుడివైపున ఉన్న Tabకు వెళ్లవచ్చు, ఇక్కడే అన్ని కొత్త హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్‌లు ఉంటాయి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మాత్రమే ఈ విధానాన్ని ఉపయోగించి స్టిక్కర్‌లను పంపుకోవచ్చు. Apple iPhone వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ వాట్సాప్ ద్వారా స్నేహితులను తమకు ఇష్టమైన స్టిక్కర్‌లను పంపవచ్చు. ఆయా స్టిక్కర్లను తమ స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాపీ న్యూఇయర్ స్టిక్కర్‌లను ఎలా పంపాలంటే? :
ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్‌లను పంపాలంటే.. యాప్‌లో డైరెక్ట్ మెసేజ్‌లను ఓపెన్ చేయాలి. ఆపై రిసీవర్ చాట్ విండోను ఓపెన్ చేయండి. దిగువన ఉన్న టెక్స్ట్-టైపింగ్ బార్ పక్కన స్టిక్కర్ ఐకాన్కనిపిస్తుంది. స్టిక్కర్-సెర్చ్ బార్‌ను ఓపెన్ చేయడానికి బటన్‌పై Tap చేయండి. న్యూ ఇయర్ స్టిక్కర్‌లను కనుగొనడానికి New Year అని టైప్ చేయండి. ఆపై మీకు నచ్చిన స్టిక్కర్‌పై Tap చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Online : వాట్సాప్‌లో మీ ఆన్‌లైన్ స్టేటస్ ఎవరికి తెలియకుండా ఇలా హైడ్ చేయొచ్చు..!