ఎయిర్‌టెల్, జియోల్లో సిగ్నల్ లేకున్నా ఫ్రీ కాల్స్

ఎయిర్‌టెల్, జియోల్లో సిగ్నల్ లేకున్నా ఫ్రీ కాల్స్

భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లలో వోవైఫై కాలింగ్ సపోర్ట్‌ను తీసుకొచ్చాయి. అంతర్జాతీయంగా ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నప్పటికీ భారత్‌లోకి ఇన్నాళ్లకు వచ్చింది. అసలు ఈ వోవైఫై(VoWi-Fi) అంటే ఏంటి? వోల్ట్‌కు దీనికి తేడా ఏంటి? ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో ఎలా వాడాలనే ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇక్కడే.

(VoWi-Fi)వోవైఫై అంటే ఏమిటి?
వోవైఫై అంటే వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్ ప్రధానంగా వైఫై కనెక్షన్ తో వాయీస్ కాల్స్ చేసుకోవడానికి సాయపడుతుంది. సిగ్నల్ లేకపోయినా, చాలా తక్కువ సిగ్నల్ పాయింట్లు చూపిస్తున్నా దీనిని వాడుకోవచ్చు. ఈ టెక్నాలజీ భారత్‌లో ఎయిర్‌టెల్, జియో నెట్‌వర్క్‌లలో అందుబాటులో ఉంది. లేటెస్ట్ యాండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ లలో మాత్రమే దీనిని వినియోగించగలం.

వోల్ట్ కాల్స్‌కు దీనికి ఏంటి తేడా?
వోల్ట్ లేదా వాయీస్ ఓవర్ ఎల్టీఈ అంటే 2జీ నెట్‌వర్క్ ఆధారిత కాల్స్‌కు కాస్త అడ్వాన్స్‌డ్ వర్షన్. ఇది 4జీ లేదా ఎల్టీఈ నెట్‌వర్క్‌లను వాయీస్ కాల్స్ రూపంలో వాడుకునేందుకు సహాయపడుతుంది. యూజర్ ఇంటర్నెట్ వాడుకుంటున్నప్పటికీ  హై క్వాలిటీ వాయీస్ కాల్స్ అందించడమే దీని ప్రత్యేకత.

వోల్ట్ ఫీచర్ మొబైల్ నెట్‌వర్క్ లేకుండా పనిచేయలేదు. వో వైఫై నెట్‌వర్క్ లేకున్నా వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే కాల్ చేసుకునేందుకు సహాయపడుతుంది. 

యాండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో వాడడం ఎలా?
యాండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి. 
ఐఫోన్‌లో మొబైల్ డేటా క్లిక్ చేసి తర్వా వైఫై కాలింగ్ ను ఆన్ చేయాలి. 
యాండ్రాయీడ్ డివైజ్‌లలో ఒక్కో ఫోన్‌లో వేరేలా ఉంటుంది. చాలా స్మార్ట్ ఫోన్లలో సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్‌వర్క్స్ సెట్టింగ్స్ లోనే ఉంటుంది. 

వో వైఫై కాల్స్ చేయడమెలా:
మీ స్మార్ట్ ఫోన్లలో వో వైఫై కాలింగ్ ఆన్ చేశాక, లో నెట్ వర్క్, సిగ్నల్ పోయినా ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఫ్లైట్ మోడ్ లో కాల్ చేయాలని ప్రయత్నించొద్దు. తప్పనిసరిగా సిగ్నల్ తక్కువ ఉందా అనే చెక్ చేసుకున్న తర్వాత వైఫై కాల్ కనెక్ట్ అవుతుంది.