NoiseFit Force Smartwatch : కేవలం రూ.3 వేలకే నాయిస్‌ఫిట్ ఫోర్స్ స్మార్ట్‌వాచ్.. 7 రోజుల బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ కాలింగ్‌ ఫీచర్లు..!

NoiseFit Force Smartwatch : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం నాయిస్ (Noise) పోర్ట్‌ఫోలియో నుంచి మరో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ వచ్చింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, 1.32-అంగుళాల హై-రిజల్యూషన్ డిస్‌ప్లే, AI వాయిస్ అసిస్టెంట్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్‌లు, థియేటర్ మోడ్, 7 రోజుల బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది.

NoiseFit Force Smartwatch : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం నాయిస్ (Noise) పోర్ట్‌ఫోలియో నుంచి మరో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ వచ్చింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, 1.32-అంగుళాల హై-రిజల్యూషన్ డిస్‌ప్లే, AI వాయిస్ అసిస్టెంట్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్‌లు, థియేటర్ మోడ్, 7 రోజుల బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది. మరిన్ని స్పోర్టింగ్ ఫీచర్‌లతో వచ్చే NoiseFit ఫోర్స్‌ వాచ్‌ను కంపెనీ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నాయిస్ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ కస్టమర్ల డిమాండ్ వినియోగానికి తగినట్టుగా రూపొందించినట్టు నివేదిక తెలిపింది.

ఇంపాక్ట్-రెసిస్టెంట్ బిల్డ్, ఫంక్షనల్ రొటేటింగ్ క్రౌన్‌తో వస్తుందని పేర్కొంది. నాయిస్ సహ వ్యవస్థాపకుడు అమిత్ ఖత్రి ప్రకారం.. న్యూజ్ ఇన్నోవేషన్‌తో యూజర్లకు అద్భుతమైన ఫీచర్లను అందించడంలో నాయిస్ ముందుంది. ఎప్పటికప్పుడూ సరికొత్త వెర్షన్లు, ప్రొడక్టులను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. యూజర్ల ఆసక్తిని వారి అవసరాలను తీర్చడానికి అడ్వెంచర్ NoiseFit ఫోర్స్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసినట్టు తెలిపింది. స్పోర్టీ లుక్స్‌తో కూడిన ఈ కొత్త స్మార్ట్‌వాచ్ స్మార్ట్‌వాచ్ రేంజ్‌లో మరో కొత్త రూపాన్ని అందిస్తుంది.

Read Also : Noise Buds Connect : కేవలం రూ. 1500లకే నాయిస్ బడ్స్ కనెక్ట్ డివైజ్.. ఫీచర్లు అదుర్స్, 50 గంటల బ్యాటరీ లైఫ్‌ కూడా..!

NoiseFit ఫోర్స్ ధర ఎంతంటే? :
నాయిస్‌ఫిట్ ఫోర్స్ వాచ్ భారత మార్కెట్లో రూ. 2,999 వద్ద లాంచ్ అయింది. మిస్ట్ గ్రే, జెట్ బ్లాక్, టీల్ గ్రీన్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో వాచ్ అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు అమెజాన్ (Amazon Sale) నుంచి NoiseFit Force వాచ్, బ్రాండ్ D2C ప్లాట్‌ఫారమ్, GoNoise నుంచి కొనుగోలు చేయవచ్చు. Noise అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక తగ్గింపు కోడ్‌ను కూడా అందిస్తోంది. NoiseFit Force వాచ్ రూ. 2,499 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.

NoiseFit Force with 7-day battery life, Bluetooth calling launched in India under Rs 3000

NoiseFit ఫోర్స్ స్పెసిఫికేషన్లు ఇవే :
NoiseFit Force 1.32-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 360 x 360 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది. అవుట్‌డోర్‌లో మెరుగైన డిస్‌ప్లే 550 నిట్‌ల వరకు అందిస్తుంది. మీరు గరిష్టంగా 150 వాచ్ ఫేస్‌ల నుంచి కూడా ఎంచుకోవచ్చు. వాచ్ IP67 రేటింగ్‌ను కలిగి ఉంది. వాటర్, డస్ట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. iOS 10 లేదా అంతకంటే ఎక్కువ లేదా Android 5.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌లో రన్ అయ్యే మీ స్మార్ట్‌ఫోన్‌తో వాచ్‌ని సులభంగా పెయిరింగ్ చేయవచ్చు. బ్లూటూత్ 5.1కి సపోర్టుతో పాటు నాయిస్ ఫిట్ ఫోర్స్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

NoiseFit Force 300mAh బ్యాటరీతో వచ్చింది. ఒకసారి ఛార్జింగ్ పెడితే.. ఏడు రోజుల వరకు వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ డివైజ్ పూర్తిగా ఛార్జ్ చేసేందుకు సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 రోజుల వరకు స్టాండ్‌బై బ్యాటరీ లైఫ్‌ను వాచ్ అందించగలదని నాయిస్ పేర్కొంది. బాక్సులో ఛార్జింగ్ కేబుల్‌ వస్తుంది. మానిటరింగ్ ఫీచర్‌ల విషయానికొస్తే.. వాచ్ 130 స్పోర్ట్స్ మోడ్‌లు, ఇంటర్నల్ నాయిస్ హెల్త్ సూట్‌తో వస్తుంది. SPO2 లెవెల్స్, హార్ట్ రేట్, స్లీప్, ఇతరత్రా 30 స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు వివిధ క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లను ట్రాక్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. అత్యంత సరసమైన ధరకే లభించే ఈ స్మార్ట్‌వాచ్ సొంతం చేసుకోండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp New Updates : వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్స్.. ఇకపై యూజర్లు కాల్స్ చేసుకోవడం చాలా ఈజీ తెలుసా?

ట్రెండింగ్ వార్తలు