నోకియా 3.1 ప్లస్: ‘ఆండ్రాయిడ్ 9 పై’ అప్ డేట్

ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ కొత్త ఆండ్రాయిడ్ అప్ డేట్ ను ప్రవేశపెట్టింది. గూగుల్ ఆండ్రాయిడ్ 9 పై అప్ డేట్ ను తమ అన్ని (పాత ఫోన్లతో సహా) ఫోన్లలో అప్ డేట్ చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : March 1, 2019 / 08:50 AM IST
నోకియా 3.1 ప్లస్: ‘ఆండ్రాయిడ్ 9 పై’ అప్ డేట్

ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ కొత్త ఆండ్రాయిడ్ అప్ డేట్ ను ప్రవేశపెట్టింది. గూగుల్ ఆండ్రాయిడ్ 9 పై అప్ డేట్ ను తమ అన్ని (పాత ఫోన్లతో సహా) ఫోన్లలో అప్ డేట్ చేస్తోంది.

ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ కొత్త ఆండ్రాయిడ్ అప్ డేట్ ను ప్రవేశపెట్టింది. గూగుల్ ఆండ్రాయిడ్ 9 పై అప్ డేట్ ను తమ అన్ని (పాత ఫోన్లతో సహా) ఫోన్లలో అప్ డేట్ చేస్తోంది. హెచ్ఎండీ గ్లోబల్ విడుదల చేసిన నోకియా 3.1 కొత్త ఫోన్ లో కూడా ఆండ్రాయిడ్ 9 పై అప్ డేట్ చేసింది. 2018 అక్టోబర్ లో విడుదలైన నోకియా 3.1 ప్లస్ పై ఓరియో బేసిడ్ ఆండ్రాయిడ్ 8.1 ను నెలవారీగా నోకియా అప్ డేట్ చేస్తోంది. 
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

ఈ ఏడాదిలో నోకియా అందించే 3.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ లో కొత్త ఆండ్రాయిడ్ వర్షన్ ను అప్ డేట్ చేసింది. నోకియా ఫీచర్ ఫోన్లు నోకియా 5, నోకియా 8 సిరోక్కో, నోకియా 5.1 ప్లస్ సహా అన్ని పాత ఫోన్లలో ఈ కొత్త ఆండ్రాయిడ్ అప్ గ్రేడ్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసినట్టు నోకియా తెలిపింది.
Read Also : ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట : పాక్ డిమాండ్

ప్రత్యేకించి నోకియా 3.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 9 పై సాఫ్ట్ వేర్ తో పాటు ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ కూడా అప్ డేట్ చేసింది. నోకియా 3.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లలో ఇటీవల హెచ్ ఎండీ గ్లోబల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.11వేల 499 నుంచి ఈ కామర్స్, మొబైల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది.  

నోకియా 3.1 ప్లస్ ఫీచర్లు..
* 3జీబీ+ర్యామ్+32 జీబీ ఇన్ బుల్ట్ స్టోరేజీ
* 6 అంగుళాల హెచ్ డీ డిసిప్లే 18:9 రెషియో
* అక్టా కోర్ మీడియాటెక్ హెలియో పీ22 చిప్ సెట్ 
* 400జీబీ మైక్రో SD కార్డ్ ఎక్స్ ఫాండబుల్
* డ్యుయల్ రియర్ కెమెరా, సింగిల్ ఫ్రంట్ కెమెరా
* 13మెగా ఫిక్సల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్/2.0 అప్రెచర్
* 5ఎంపీ సెకండరీ సెన్సార్, ఎల్ ఈడీ ప్లాష్ సపోర్ట్
* 8ఎంపీ సెల్ఫీ షూటర్, ఎఫ్/2.2 అప్రెచర్
* 3500 ఎంహెచ్ బ్యాటరీ (రెండు రోజులు ఫుల్ బ్యాకప్)
* బ్లూ, బాల్టిక్, వైట్ మూడు వేరియంట్లు 
Read Also : ఆధార్ అప్ డేట్ : ఇకపై ఆ మూడింటికీ తప్పనిసరి