కొత్త ఫోన్ గురూ : నోకియా 4.2 రిలీజ్.. ధర ఎంతంటే?

ఇండియన్ యూజర్లను ఊరిస్తోన్న మొబైల్ తయారీ కంపెనీ.. నోకియా కంపెనీ ఎట్టకేలకు.. ఇండియాలో తమ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే తేదీని ప్రకటించింది. 

  • Published By: sreehari ,Published On : May 6, 2019 / 01:03 PM IST
కొత్త ఫోన్ గురూ : నోకియా 4.2 రిలీజ్.. ధర ఎంతంటే?

ఇండియన్ యూజర్లను ఊరిస్తోన్న మొబైల్ తయారీ కంపెనీ.. నోకియా కంపెనీ ఎట్టకేలకు.. ఇండియాలో తమ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే తేదీని ప్రకటించింది. 

కొన్ని నెలలుగా ఇండియన్ స్మార్ట్ ఫోన్ యూజర్లను ఊరిస్తోన్న మొబైల్ తయారీ కంపెనీ.. నోకియా ఎట్టకేలకు.. ఇండియాలో తమ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే తేదీని ప్రకటించింది.  2019, మే 7న ఇండియన్ మార్కెట్లలో కంపెనీ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ నోకియా 4.2 మోడల్ విడుదల కానున్నట్టు నోకియా మొబైల్ ఇండియా కంపెనీ తమ అధికారిక ట్విట్టర్ లో ప్రకటించింది.

2019, ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)ఈవెంట్ లో..  ప్రకటించింది. అప్పటినుంచి ఇండియాలో నోకియా కంపెనీ ఇప్పటివరకూ ఒక్క సింగిల్ స్మార్ట్ ఫోన్ కూడా రిలీజ్ చేయలేదు. కానీ, నోకియా 4.2 మోడల్ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి టీజర్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లతో రిలీజ్ కానుంది. అయితే.. నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ఫీచర్లు, ధరకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఇండియన్ మార్కెట్లలో నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ (2GB RAM / 16GB స్టోరేజీ వెర్షన్)తో ఒక వేరియంట్ ధర 169 అమెరికా డాలర్లు (రూ.12వేల 005) వరకు ఉంటుందని అంచనా. రెండో వేరియంట్ స్మార్ట్ ఫోన్ (3GB ర్యామ్/ 32GB ఇంటర్నెట్ స్టోరేజీ వెర్షన్) ధర 199 యూఎస్ డాలర్లు (రూ.14వేల 135) వరకు ఉండే అవకాశం ఉంది. ఈ రెండు రకాల స్మార్ట్ ఫోన్ వేరియంట్లలో బ్లాక్, పింక్ సాండ్ కలర్లలో లభ్యం కానుంది. ఈ నోకియా కొత్త స్మార్ట్ ఫోన్లో ఫీచర్లు, స్పెషిఫికేషన్ల హైలెట్లు ఏంటో ఓసారి లుక్కేయండి. 

స్పెషిఫికేషన్లు.. ఫీచర్లు ఇవే :
* డ్యుయల్ రియర్ కెమెరాలు
* 13MP ప్రైమరీ రియర్ కెమెరా, PDAF వ/2.2 అప్రెచర్
* సెకండరీ 2 MP కెమెరా, 8MP కెమెరా f/2.2 అప్రెచర్ 
* క్వాలికామన్న్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 439 ప్రాసిసర్
* 5.1 అంగుళాల HD+19:9 డిసిప్లే  
* పవర్ బటన్.. LED నోటిఫికేషన్ ఫ్లాష్ లైట్, 1.12µm ఫిక్సల్ సైజు
* గూగుల్ అసిస్టెంట్ బటన్ 
* 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజీ
* 3GB ర్యామ్, 32GB స్టోరేజీ వెర్షన్
* బ్లాక్, పింక్ సాండ్ కలర్ 
* 5.71 అంగుళాల HD+ ఫుల్ వ్యూ (1520*720 ఫిక్సల్స్) డిసిప్లే స్పోర్ట్స్ 
* వాటర్ డ్రాప్ నాచ్, 2.5D కర్వడ్ గ్లాస్
* అడ్రినో 505 CPU
* 400 GB మైక్రో SD ఎక్స్ పాండబుల్ మెమెరీ
* ఆండ్రాయిడ్ 9.0 పై
* సింగిల్/ డ్యుయల్ SIM కనెక్టవిటీ