Nokia C30 Phone : రూ.10వేల లోపు నోకియా కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

ప్రముఖ HMD గ్లోబల్ సంస్థ నోకియా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. అదే.. Nokia C30 ఫోన్.. మూడు వేరియంట్లలో (2GB RAM + 32GB ఇంటర్నల్ స్టోరేజీ), (3GB RAM + 32GB storage), (3GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజీ) లాంచ్ అయింది.

10TV Telugu News

Nokia C30 budget phone : ప్రముఖ HMD గ్లోబల్ సంస్థ నోకియా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. అదే.. Nokia C30 ఫోన్.. మూడు వేరియంట్లలో (2GB RAM + 32GB ఇంటర్నల్ స్టోరేజీ), (3GB RAM + 32GB storage), (3GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజీ) లాంచ్ అయింది. రూ.10వేల లోపు సరసమైన ధరకే గ్లోబల్ లాంచ్ అయింది. అయితే భారత మార్కెట్లో ఈ కొత్త నోకియా బడ్జెట్ ఫోన్ వివరాలను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.

ఫీచర్లు విషయానికి వస్తే.. ఇందులో మైక్రోSD కార్డు సపోర్టు ఉంది. ఫొటోలు, వీడియోల కోసం స్టోరేజీని ఎక్స్ ఫ్యాండ్ చేసుకోవచ్చు. ధర విషయానికి వస్తే.. కొత్త Nokia C30 మోడల్ ఫోన్ 99 యూరోలు. (మన కరెన్సీలో రూ. 8,700) వరకు ఉంటే అవకాశం ఉంది. ఇక బేస్ మోడల్ ఫోన్ వచ్చేసి 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీ అందిస్తోంది. మూడు వేరియంట్లు రెండు కలర్ ఆప్షన్లు (గ్రీన్, వైట్)లో వస్తున్నాయి.

Nokia C30 specifications
-6.82 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే (1600×720) ఫిక్సల్స్, 20:9 యాస్పెక్ట్ రేషియో
– ఆక్టా-కోర్ ప్రాసెసర్, ఫోర్ A55 కోర్స్, 1.6GHz, ఫోర్ A55 కోర్స్, 1.2GHz.
– 3GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజీ
– డ్యుయల్ సెటప్ (బ్యాక్), 13MP ప్రైమరీ సెన్సార్, LED ఫ్లాష్, 2MP సెకండరీ సెన్సార్
-5MP ఇమేజ్ సెన్సార్ (సెల్ఫీ కెమెరా) ఫ్రంట్
– ఎంట్రీ లెవల్ హార్డ్ వేర్, ఆండ్రాయిడ్ 11 గో ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్టిమైజడ్ వెర్షన్
– 6,000mAh బ్యాటరీ, 10W చార్జింగ్ సపోర్ట్
– 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, Bluetooth 4.2, GPS + GLONASS
– మైక్రో-USB పోర్ట్, రియర్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్

10TV Telugu News